అఫీషియల్: 13న వెంకీమామ రిలీజ్

Monday,December 02,2019 - 07:35 by Z_CLU

చాలా డేట్స్ తెరపైకొచ్చాయి. ఏదీ ఫిక్స్ కాలేదు. ఫైనల్ గా వెంకీమామ రిలీజ్ డేట్ ఫిక్స్ అయింది. ఈసారి ఇది అఫీషియల్. వెంకీ బర్త్ డే సందర్భంగా డిసెంబర్ 13న ఈ సినిమాను రిలీజ్ చేయబోతున్నట్టు స్వయంగా మేకర్స్ ఎనౌన్స్ చేశారు. ఈ మేరకు రానా కూడా తన ట్విట్టర్ హ్యాండిల్ లో ఓ వీడియో పోస్ట్ చేశాడు.

ఈ సినిమా రిలీజ్ డేట్ పై ఈమధ్యంతా చాలా గందరగోళం నడిచింది. ఓ దశలో సంక్రాంతికి సినిమా వస్తుందనుకున్నారు. చివరికి వెంకీ పుట్టినరోజుకు కూడా ఈ సినిమా రాదేమో అనే డౌట్స్ వినిపించాయి. ఫైనల్ గా డిసెంబర్ 13నే వస్తున్నట్టు అధికారికంగా ప్రకటించారు.

రియల్ లైఫ్ మామాఅల్లుళ్లు వెంకటేష్, నాగచైతన్య కలిసి నటించిన సినిమా కావడంతో ఈ మూవీపై చాలా అంచనాలున్నాయి. ఇప్పటికే మూవీకి సంబంధించి 2 టీజర్లు రిలీజ్ చేశారు. సాంగ్స్ కూడా రిలీజ్ అవుతున్నాయి. ఇక మిగిలింది 10 రోజులే కావడంతో, సినిమా ప్రమోషన్ ను మరింత ఎగ్రెసివ్ గా చేయబోతున్నారు.