మైండ్ బ్లాక్ చేసిన మహేష్ బాబు

Monday,December 02,2019 - 05:35 by Z_CLU

సంక్రాంతి అంటేనే జోష్. అందుకే ఓ జోష్ ఫుల్ సాంగ్ తోనే తన పాటల హంగామా షురూ చేశాడు మహేష్ బాబు. సరిలేరు నీకెవ్వరు సినిమాకు సంబంధించి ఫస్ట్ లిరికల్ వీడియో వచ్చేసింది. దేవిశ్రీ ప్రసాద్ మాస్ బీట్ అదిరింది. మైండ్ బ్లాక్ అనే లిరిక్స్ తో సాగే ఈ సాంగ్ లో హైలైట్ ఏంటంటే.. మధ్యమధ్యలో మహేష్ బాబు వాయిస్ కూడా వినిపించడం.

శ్రీమణి, దేవిశ్రీ కలిసి ఈ పాటకు సాహిత్యం సమకూర్చగా.. బ్లేజ్, రనీనా రెడ్డి ఈ పాటను ఆలపించారు. పాట వింటుంటే.. మూవీలో ఇది ఓ స్పెషల్ సాంగ్ అనిపిస్తోంది. మేకర్స్ ఫస్ట్ నుంచి చెబుతున్నట్టు.. మహేష్ బాబు వాయిస్ యాడ్ అవ్వడంతో ఈ సాంగ్ నిజంగానే స్పెషల్ అనిపించుకుంది.

ఈ సాంగ్ తో సరిలేరు నీకెవ్వరు పాటల హంగామా మొదలైంది. ఇక నుంచి మినిమం గ్యాప్స్ లో లిరికల్ వీడియోస్ అన్నీ రిలీజ్ చేయబోతున్నారు.