మెగా హీరో ..బ్యాక్ టు బ్యాక్ మూవీస్

Sunday,November 11,2018 - 03:02 by Z_CLU

ప్రస్తుతం మెగా హీరోలందరూ ఒక్కో సినిమాతో బిజీగా ఉన్నారు. అయితే మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ మాత్రం ఇందుకు మినహాయింపు అనే చెప్పాలి. ప్రస్తుతం వరుణ్ తేజ్ రెండు సినిమాలను రిలీజ్ కి చేస్తున్నాడు. ఇటివలే సంకల్ప్ రెడ్డి డైరెక్షన్ లో ‘ అంతరిక్షం’ అనే స్పేస్ సినిమాను కంప్లీట్ చేసిన వరుణ్ తేజ్ ప్రస్తుతం ‘ఎఫ్2’ సినిమా షూటింగ్ లో బిజీ గా ఉన్నాడు. ఈ సినిమాలో వెంకటేష్ తో స్క్రీన్ షేర్ చేసుకోబోతున్న వరుణ్ తేజ్ ఈ రెండు సినిమాలతో మెగా ఫాన్స్ ను డబుల్ ఖుషి చేయబోతున్నాడు.

వరుణ్ నటించిన ‘అంతరిక్షం 9000 KMPH’సినిమా డిసెంబర్ 21న విడుదల అవుతుండగా ‘ఎఫ్2’ సినిమా సంక్రాంతి కానుకగా జనవరిలో విడుదల కానుంది. సో మెగా హీరో వరుణ్ తేజ్ నుంచి నెల గ్యాప్ లో రెండు సినిమాలు థియేటర్స్ లోకి రానున్నాయన్నమాట. ఈ రెండు సినిమాలు రిలీజ్ అయ్యాక నెక్స్ట్ సినిమాను సెట్స్ పైకి తీసుకొచ్చే ఆలోచనలో ఉన్నాడు మెగా ప్రిన్స్.