త్వరలోనే సెట్స్ పైకి రానున్న అనుష్క సినిమా

Sunday,November 11,2018 - 01:33 by Z_CLU

బాహుబాలి, భాగమతి సినిమాల తర్వాత కాస్త గ్యాప్ తీసుకున్న అనుష్క ఎట్టకేలకు  నెక్స్ట్ సినిమాను ఫైనలైజ్ చేసుకుంది… ఇటివలే హేమంత్ మధుకర్ అనే దర్శకుడు చెప్పిన కథకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన అనుష్క త్వరలోనే ఈ సినిమా షూటింగ్ లో పాల్గొనబోతుంది. లేడీ ఓరియంటెడ్ సినిమాగా తెరకెక్కనున్న ఈ సినిమాలో మాధవన్ ఓ ఇంపార్టెంట్ రోల్ లో కనిపించనున్నాడు. గతంలో వీరిద్దరూ కలిసి ‘రెండు’ అనే సినిమాలో నటించారు. మళ్ళీ ఇన్నాళ్ళకి ఈ సినిమాతో ఈ ఇద్దరూ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.

కోనా వెంకట్ సమర్పణలో పీపుల్ మీడియా ఫాక్టరీ బ్యానర్ పై తెరకెక్కనున్న ఈ సినిమాను ఇటివలే అనుష్క బర్త్ డే సందర్భంగా అఫీషియల్ గా అనౌన్స్ చేసారు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటున్న ఈ సినిమా డిసెంబర్ నుండి సెట్స్ పైకి రానుంది. ఈ సినిమాను తమిళ్ , తెలుగులో సైమల్టియస్ గా తెరకెక్కించేందుకు ప్లాన్ చేస్తున్నారు మేకర్స్.