మెగా హీరోలకి భలే కలిసొచ్చింది

Sunday,December 29,2019 - 01:06 by Z_CLU

ఈ ఏడాది కొందరు యంగ్ హీరోలు రెండేసి సినిమాలు చేసినా వాళ్ళలో ఇద్దరు మాత్రమే బ్యాక్ టు బ్యాక్ హిట్స్ అందుకున్నారు. వారే వరుణ్ తేజ్ ..సాయి తేజ్. అవును ఈ ఇద్దరు మెగా హీరోలకి ఈ ఏడాది బాగా కలిసొచ్చింది.

గతేడాది చివర్లో ‘అంతరిక్షం’ సినిమాతో ఫ్లాప్ అందుకున్న వరుణ్ తేజ్ ఈ ఇయర్ ‘F2’ తో అదిరిపోయే బోణి కొట్టాడు. సంక్రాంతి స్పెషల్ గా రిలీజయిన ఈ సినిమాతో వరుణ్ కి బ్లాక్ బస్టర్ హిట్ దొరికింది. ఇక ఈ సినిమా తర్వాత కొన్ని నెలలకే మళ్ళీ ‘గద్దల కొండ గణేష్’ తో మంచి విజయం అందుకున్నాడు వరుణ్.

వరుస ఫ్లాపులతో కెరీర్ ని కొనసాగిస్తున్న సాయి ధరం తేజ్ కి ఈ ఇయర్ చాలా స్పెషల్ గా  మారింది. ‘చిత్ర లహరి’ తో హిట్టు కొట్టిన  సాయి ధరం తేజ్ ఏడాది చివర్లో వచ్చిన ‘ప్రతి రోజు పండగే’ తో కెరీర్ బిగ్గెస్ట్ హిట్ అందుకున్నాడు. ‘చిత్రలహరి’ సాయి కి మళ్ళీ ఓ కొత్త ఉత్సాహాన్ని అందిస్తే ‘ప్రతి రోజు పండగే’ ఏకంగా తేజ్ మార్కెట్ కి మళ్ళీ ఓ  ఊపు తీసుకొచ్చింది. ఇలా ఈ ఇయర్ రెండు సినిమాలతో బ్యాక్ టు బ్యాక్ హిట్స్ అందుకొని 2019 మోర్ స్పెషల్ గా మార్చుకున్నారు మెగా కుర్ర హీరోలు. మరి నెక్స్ట్ ఇయర్ కూడా వరుణ్, తేజ్ ఇలాంటి హిట్స్ అందుకోవాలని ఆశిద్దాం.