'వాల్మీకి' లో హైలైట్ కానున్న సాంగ్

Tuesday,September 17,2019 - 06:42 by Z_CLU

వరుణ్ తేజ్ , హరీష్ కాంబినేషన్ లో తెరకెక్కిన ‘వాల్మీకి’ ఈ నెల 20న థియేటర్స్ లోకి రానున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో ‘ఎల్లువొచ్చి గోదారమ్మ’ అనే రీమిక్స్ సాంగ్ ఇప్పుడు ఆడియన్స్ ను రిలీజ్ కి ముందే ఎట్రాక్ట్ చేస్తూ సినిమాపై క్యూరియాసిటీ పెంచేస్తుంది. లేటెస్ట్  సాంగ్ కి సంబంధించి ప్రోమో రిలీజ్ చేసారు మేకర్స్.

అలనాటి క్లాసిక్ సినిమా ‘దేవత’ లో ఎల్లువొచ్చి గోదారమ్మ సాంగ్ ఆ సినిమాకు హైలైట్ నిలిచింది. ముఖ్యంగా ఆ పాటకు చక్రవర్తి అందించిన ట్యూన్, వేటూరి సాహిత్యం ఒకేత్తైతే దాన్ని సలీం మాస్టర్ తో కలిసి  రాఘవేంద్రరావు తెరకెక్కించడం మరో ఎత్తు. ఆ పాట కోసం వెయ్యి బిందెలు వాడి, వాటి మధ్య శోభన్ బాబు , శ్రీదేవిలతో స్టెప్స్ వేయించి మేజిక్ చేసాడు దర్శకేంద్రుడు. అయితే ఇప్పుడు ఈ రీమిక్స్ సాంగ్ కోసం కూడా దాదాపు వెయ్యి బిందెలు వాడారు. వరుణ్ తేజ్ , పూజా హెగ్డేలపై తెరకెక్కించిన ఈ పాటకు శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీ చేసాడు.

లేటెస్ట్ గా రిలీజ్ చేసిన ఈ రీమిక్స్ సాంగ్ ప్రోమో అందరినీ ఎట్రాక్ట్ చేస్తుంది. రెట్రో గెటప్ లో వరుణ్ తేజ్ శోభన్ బాబు సిగ్నేచర్ స్టెప్స్ వేయడం పాటపై ఆసక్తిను నెలకొల్పుతుంది. కొన్ని ఫ్రేమ్స్ లో మెగా స్టార్ ను గుర్తుచేస్తున్నాడు కూడా.  పూజా హెగ్డే కూడా తన గ్లామర్ తో సాంగ్ లో స్పెషల్ ఎట్రాక్షన్ గా మారింది. ఇవన్నీ కలిపి ఈ రీమిక్స్ సాంగ్ ను మరింత స్పెషల్ సాంగ్ గా తీర్చిదిద్దాయి. మరి థియేటర్స్ లో ఈ సాంగ్ హైలైట్ అయితే హరీష్ శంకర్ అనుకున్నది సాధించినట్టే.