రేపే సైరా ట్రయిలర్

Tuesday,September 17,2019 - 02:45 by Z_CLU

టాలీవుడ్ మోస్ట్ ఎవెయిటింగ్ మూవీ సైరా ట్రయిలర్ మరికొన్ని గంటల్లో మార్కెట్లోకి రాబోతోంది. ప్రీ-రిలీజ్ ఫంక్షన్ పోస్ట్ పోన్ అవ్వడంతో, ట్రయిలర్ లాంచ్ ను కూడా వాయిదా వేస్తారని అంతా అనుకున్నారు. కానీ ప్రీ-రిలీజ్ ఫంక్షన్ తో సంబంధం లేకుండా ట్రయిలర్ ను రిలీజ్ చేయబోతున్నారు. తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో ఒకేసారి రిలీజ్ అవుతోంది ట్రయిలర్.

టీజర్ తో ఇప్పటికే సినిమాపై ఓ క్లారిటీ ఇచ్చారు మేకర్స్. కేవలం చిరంజీవి లుక్స్ కే పరిమితం కాకుండా.. స్టోరీలైన్ తో పాటు మిగతా ఆర్టిస్టులందరికీ ఇంపార్టెన్స్ ఇచ్చారు. ఇప్పడు ట్రయిలర్ లో కూడా అదే ఫార్మాట్ ఫాలో అవుతున్నారు. దీంతో పాటు సినిమా కోసం పెట్టిన ఖర్చు, భారీతనం కనిపించేలా ట్రయిలర్ ఉండబోతోంది.

లేటెస్ట్ అప్ డేట్ ప్రకారం.. సైరా ట్రయిలర్ డ్యూరేషన్ 3 నిమిషాలకు కాస్త తక్కువగా ఉంది. ట్రయిలర్ ను డిజిటల్ ప్లాట్ ఫామ్ లో రిలీజ్ చేయడంతో పాటు తెలుగు రాష్ట్రాల్లోని కొన్ని థియేటర్లలో రేపు సాయంత్రం నుంచి ప్రసారం చేయబోతున్నారు. అక్టోబర్ 2న వరల్డ్ వైడ్ థియేటర్లలోకి రాబోతోంది సైరా.