Shruti Haasan - సాంబార్ రైస్, జపాన్

Friday,April 16,2021 - 02:54 by Z_CLU

టైమ్ దొరికితే ఫ్యాన్స్ తో ఛాట్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు హీరోయిన్స్. రీసెంట్ గా శృతిహాసన్ కూడా అదే పని చేసింది. తన ఇష్టాఇష్టాలతో పాటు చాలా విషయాల్ని బయటపెట్టింది.

⇒ ప్రభాస్ తో సలార్ ఎక్స్ పీరియన్స్?
సూపర్ గా ఉంది.. ప్రభాస్ లవ్లీ పర్సన్, ప్రభాస్ చాలా ఛిల్

⇒ స్కూల్ లో ఫేవరెట్ సబ్జెక్ట్?
హిస్టరీ, బయోగ్రఫీ

⇒ భవిష్యత్ లో ఎలాంటి సినిమాలు కావాలి?
నన్ను ఛాలెంజ్ చేసే క్యారెక్టర్స్ చేయాలనుకుంటున్నాను

⇒ కాలంలో వెనక్కి వెళ్లే ఛాన్స్ వస్తే?
మళ్లీ వెనక్కి వెళ్లే ఛాన్స్ వస్తే ఈజిప్ట్ వెళ్తాను. అక్కడ పిరమిడ్స్ ఎలా కట్టారో చూస్తాను. అంతేకాదు, 50 ఏళ్ల
కిందట న్యూయార్క్ లో జరిగిన ఉడ్ స్టాక్ మ్యూజిక్ ఫెస్టివల్ కు వెళ్తాను.

⇒ ఊహ తెలిసిన తర్వాత ఫస్ట్ క్రష్?
మొగాంబో

⇒ స్కూల్ డేస్ లో క్రష్ ఎవరు?
హృతిక్ రోషన్, లియోనార్డో డికాప్రియో

  • Shruti-Hassan

కరోనా టైమ్ లో కూడా క్రాక్, వకీల్ సాబ్ రూపంలో బ్యాక్ టు బ్యాక్ బ్లాక్ బస్టర్స్ ఎలా?
చాలా హ్యాపీగా ఉంది. నా అదృష్టం అనుకోవాలేమో. నా వర్క్ ను ఆడియన్స్ ఎంజాయ్ చేస్తున్నారు. చాలా
ఆనందంగా ఉంది.

లాక్ డౌన్ టైమ్ లో నేర్చుకున్న మంచి విషయం?
ఓపిగ్గా, సహనంగా ఎలా ఉండాలో నేర్చుకున్నాను.

⇒ ప్రతిసారి వెళ్లాలనిపించే ప్రదేశం?
జపాన్ అంటే చాలా ఇష్టం. ఎన్ని సార్లయినా వెళ్లాలనిపిస్తుంది.

  • Actress-ShrutiHaasan-Stills-ZeeCinemalu

⇒ ప్రస్తుతం మొబైల్ లో ఆడుతున్న గేమ్స్?

బబుల్ విచ్, క్యాండీ క్రష్, సోడా పాప్ క్రష్

⇒ మీ గురించి ఎవ్వరికీ తెలియని విషయం?
పాములంటే నాకు చచ్చేంత భయం.

⇒ఇష్టమైన వంటకాలు?
సాంబార్ రైస్, దోశ.. ఈ రెండు ఉంటే జీవితాంతం బతికేస్తా.

⇒ రీసెంట్ గా మీరు పొందిన గొప్ప అనుభూతి?
చాన్నాళ్ల తర్వాత నాతో నేను మరోసారి ప్రేమలో పడ్డాను

  • – Follow Us for Latest Telugu Zee Cinemalu News and upcoming trending
    stories, Gossips, Actress Photos and Special topics