Nayanthara 22న 'కనెక్ట్' రిలీజ్
Monday,December 05,2022 - 11:58 by Z_CLU
UV Creations To Present Nayanthara’s Connect in Telugu
నయనతార (Nayanthara) నాయికగా నటించిన హారర్ థ్రిల్లర్ “కనెక్ట్” సినిమాను యూవీ క్రియేషన్స్ తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తోంది. ఈ చిత్రాన్ని రౌడీ పిక్చర్స్ పతాకంపై విఘ్నేష్ శివన్ నిర్మించారు. దర్శకుడు అశ్విన్ శరవణన్ ఈ చిత్రాన్ని రూపొందించారు.
హారర్ థ్రిల్లర్ మూవీస్ రూపొందించడంలో దర్శకుడు అశ్విన్ శరవణన్ స్పెషలిస్ట్. నయనతార నాయికగా ఆయన రూపొందించిన “మయూరి” సినిమా తెలుగులో విజయాన్ని సాధించింది. అలాగే తాప్సీ నాయికగా శరవణన్ తెరకెక్కించిన “గేమ్ ఓవర్” కూడా సూపర్ హిట్టయ్యింది. కనెక్ట్ (Connect Movie) చిత్రాన్ని కూడా ఆయన ఇంతే ఆసక్తి కలిగించేలా రూపొందించినట్లు తెలుస్తోంది.

ఇటీవల నయనతార పుట్టినరోజు సందర్భంగా విడుదల చేసిన కనెక్ట్ టీజర్‌కు సూపర్బ్ రెస్పాన్స్ వచ్చింది. ఈ చిత్రాన్ని ఈ నెల 22న తెలుగులో గ్రాండ్ గా విడుదల చేసేందుకు యూవీ క్రియేషన్స్ సంస్థ సన్నాహాలు చేస్తోంది. ఈ సినిమా నుంచి ఇప్పటిదాకా రిలీజ్ చేసిన టీజర్, పోస్టర్స్ మూవీ చూడాలనే ఆసక్తిని కలిగిస్తున్నాయి.
అనుపమ్ ఖేర్‌తోపాటు సత్యరాజ్, వినయ్ రాయ్, హనియ నఫిస కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి పృథ్వి చంద్రశేఖర్ సంగీతం అందిస్తుండగా మణికంఠన్ కృష్ణమాచారి సినిమాటోగ్రఫర్ గా వర్క్ చేశారు.
- Follow Us for Latest Telugu Zee Cinemalu News and upcoming trending stories, Gossips, Actress Photos and Special topics