బతుకమ్మ ఆడిన ఉపాసన

Tuesday,October 11,2016 - 03:19 by Z_CLU

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ భార్య ఉపాసన బతుకమ్మ సెలబ్రేషన్స్ లో పాల్గొన్నారు. బతుకమ్మ సెలబ్రేషన్స్ కి సంబంధించి ఆమె తన ఫేస్ బుక్ పేజీలో కొన్ని ఫొటోస్ పోస్టు చేయడంతో పాటు ఈ ఉత్సవాలకు సంబంధించి తన జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. ప్రతి సంవత్సరం తమ ఫ్యామిలీ బతుకమ్మ సంబరాలు చాలా గ్రాండ్ గా జరుపుకుంటుందని… గ్రాండ్ మదర్ నిర్వహిస్తున్న ‘బాలిక నిలయం’ అనే అనాధ శరణాలయానికి చెందిన పిల్లలు బతుకమ్మలు తయారు చేయడంలో తమకు హెల్ప్ చేశారని ఉపాసన తెలిపారు.
upasana-batukamma-ramcharan
ఇలాంటి సందర్భాలు మాతో పాటు ఆ అమ్మాయిలకు లైఫ్ లాంగ్ జ్ఞాపకాలుగా మిగిలిపోతాయి. నేను ఈ అమ్మాయిలతో పాటు పెరిగాను. వారి మొహాల్లో సంతోషం, ఆనందం చూడటం అంటే నాకు చాలా ఇష్టమని ఉపాసన రాసుకొచ్చారు. బాలిక నిలయం అమ్మాయిలు, కుటుంబంతో గడపటం చాలా సంతోషంగా ఉందంటోంది ఉపాసన.