కొడుక్కి ప్రేమతో...

Tuesday,October 11,2016 - 03:29 by Z_CLU

 నాన్నకు ప్రేమతో సినిమా చూశాం. కానీ ఇక్కడ కొడుక్కి ప్రేమతో సీన్ చూస్తున్నాం. అవును.. అల్లు శిరీష్ కు అతడి తండ్రి అల్లు అరవింద్ గిఫ్ట్ ఇస్తున్న ఫొటో ఇది. పుత్రోత్సాహం అంటాం కదా.. అదే ఇది. అల్లు శిరీష్ పరిశ్రమలోకి అడుగుపెట్టి చాన్నాళ్లయింది. కానీ సక్సెస్ తెచ్చుకుంది మాత్రం ఈమధ్యే. పరశురాం దర్శకత్వంలో అల్లు శిరీష్ చేసిన శ్రీరస్తు-శుభమస్తు సినిమా మంచి సక్సెస్ సాధించింది. శిరీష్ కు మొట్టమొదటి కమర్షియల్ విజయాన్ని అందించింది. దీంతో కేవలం ఓ నిర్మాతగానే కాకుండా.. తండ్రిగా కూడా అల్లు అరవింద్ ఉబ్బితబ్బిబ్బయ్యాడు. అందుకే కొడుక్కి ఇలా ఆడి-క్యూ7 కారును ప్రేమతో బహుమతిగా ఇచ్చాడు. ఈ ఆనందంలో అల్లు అర్జున్ కూడా పాలుపంచుకున్నాడు.

srirastustill_jpg_2960473f