అల్టిమేట్ స్పై థ్రిల్లర్

Friday,March 31,2017 - 05:14 by Z_CLU

బాలీవుడ్ లో అక్షయ్ కుమార్ హీరోగా నటించిన బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ ‘బేబీ’ సినిమాలో షబానా అనే క్యారెక్టర్ లో నటించింది తాప్సీ. కేవలం 15 నిమిషాల నిడివిలో కనిపించే ఈ క్యారెక్టర్ ‘బేబీ’ సినిమా సక్సెస్ పై చూపించిన ఇంపాక్ట్ అంతా ఇంతా కాదు. అందుకే కేవలం ఆ క్యారెక్టర్ ని మైండ్ లో పెట్టుకునే నామ్ షబానా సినిమాకి స్క్రిప్ట్ రెడీ చేసుకున్నారు ఫిలిం మేకర్స్. ఇప్పుడీ సినిమా బాలీవుడ్ లో సరికొత్త ట్రెండ్ ని సృష్టించేంత సక్సెస్ టాక్ ని బ్యాగ్ లో వేసుకుంటుంది.

శివమ్ నాయర్ డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ స్పై థ్రిల్లర్ లో అక్షయ్ కుమార్ కూడా ఓ కీ రోల్ ప్లే చేశాడు. మ్యాగ్జిమం బేబీ సినిమాలో నటించిన యాక్టర్స్ అందరూ షబానా సినిమాలను కనిపిస్తారు. ఒక్క రానా తప్ప. ఈ సినిమా కోసం తాప్సీ స్పెషల్ గా మార్షల్ ఆర్ట్స్ ట్రేనింగ్ కూడా తీసుకుంది. నీరజ్ పాండే, శీతల్ భాటియా కలిసి నిర్మించిన ఈ సినిమాకి రోచాక్ కోహ్లి, మీట్ బ్రాస్ మ్యూజిక్ కంపోజ్ చేశారు.