ఏప్రియల్ లో సందడి గ్యారంటీ

Friday,March 31,2017 - 03:49 by Z_CLU

మెగాస్టార్ 151 ఎక్కడి వరకు వచ్చింది..? సురేందర్ రెడ్డి డైరెక్షన్ లో తెరకెక్కాల్సిన ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ ఆల్ మోస్ట్ కంప్లీట్ అయిపోయింది. మెగా పవర్ స్టార్ నిర్మిస్తున్న ఈ సినిమా గురించి ఏ టాపిక్ బయటికి రాకపోయేసరికి ఫ్యాన్స్ లో క్యూరాసిటీ రేజ్ అయిపోతుంది.

ఈ సినిమాలో ఉయ్యాల వాడ నరసింహా రెడ్డిగా పవర్ ఫుల్ ఇండిపెండెన్స్ ఫైటర్ లా కనిపించనున్న మెగాస్టార్, ఆల్ రెడీ ఈ క్యారెక్టర్ కోసం మేకోవర్ ప్రాసెస్ లో ఉన్నాడా…? హిస్టారికల్ బ్యాక్ డ్రాప్ తో తెరకెక్కనున్న సినిమా కాబట్టి ఈ సినిమాలో చిరు గెటప్ ఎలా ఉండబోతుంది..? అసలు సినిమా సెట్స్ పైకి ఎప్పుడు రాబోతుంది..? ఇదే ఇప్పుడు మెగాస్ట్రీట్ లో చక్కర్లు కొడుతున్న క్వశ్చన్.

ఖైదీ నం 150 లాంటి మెగా మాస్ బ్లాక్ బస్టర్ తరవాత మళ్ళీ అదే రేంజ్ హై వోల్టేజ్ కంటెంట్ తో రెడీ అవుతున్న ఈ సినిమా ఏప్రియల్ లో సెట్స్ పైకి రావడం గ్యారంటీ అంటున్నాయి ఇన్ సైడ్ సోర్సెస్. ఈ విషయంలో అఫీషియల్ కన్ఫర్మేషన్ అయితే రాలేదు కానీ, టీమ్ మాత్రం ఎనీ టైం రెడీ మోడ్ లో ఉందని తెలుస్తుంది.