F3 ఎందుకు చూడాలి ? TOP 7 రీజన్స్ ఇవే

Wednesday,May 25,2022 - 01:11 by Z_CLU

Top 7 Reasons to Watch F3 Movie

విక్టరీ వెంకటేష్ , మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ కాంబినేషన్ లో అనిల్ రావిపూడి దర్శకత్వంలో దిల్ రాజు శిరీష్ నిర్మాణంలో తెరకెక్కిన ఫన్ ఫ్రాంచైజీ ‘F3’ మరో రెండు రోజుల్లో థియేటర్స్ లో ఎంట్రీ ఇస్తుంది. మూడేళ్ళ క్రితం సంక్రాంతి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన ‘F2’ కి ఫ్రాంచైజీగా వస్తున్న ఈ సినిమాలో చాలా స్పెషల్ ఎట్రాక్షన్స్ ఉన్నాయి. అందులో సినిమా చూడటానికి ఓ 7 రీజన్స్ ఇప్పుడు చూద్దాం.

f3-movie-12
F2 ఫ్రాంచైజీ

ఈ సినిమా చూడటానికి మెయిన్ రీజన్ F2  ఫ్రాంచైజీ. తెలుగులో ఇప్పటి వరకూ ఫన్ ఫ్రాంచైజీ రాలేదు. ఇదే మొదటి సినిమా. F2 థియేటర్స్ లో ఏ రేంజ్ హిట్ సాధించిందో తెలిసిందే. ఫ్యామిలీ ఆడియన్స్ ని థియేటర్స్ కి రప్పించి పూర్తి వినోదం పంచి 100 కోట్ల క్లబ్ లో చేరింది. ఆ సినిమాకు ఫ్రాంచైజీ కాబట్టి ఈసారి ఎంటర్టైన్ మెంట్ డోస్ మరింత పెంచి తెరకెక్కించారు. పైగా ఎఫ్ 2 కంటే ఇందులో ఎక్కువ మంది ఆర్టిస్టులు ఉన్నారు. సునీల్ , సోనాల్ చౌహాన్ ఇంకా కొందరు యాక్టర్స్ యాడ్ అయ్యారు. ట్రైలర్ చూస్తే ఈ ఫ్రాంచైజీ లో ఫన్ ఏ స్థాయిలో ఉండబోతుందో అర్థమవుతుంది. ఇందులో నాన్ స్టాప్ ఫన్ సీన్స్ చాలానే ప్లాన్ చేసుకున్నాడు దర్శకుడు అనీల్ రావిపూడి.

venkatesh-and-varun-tej-F3-TRAILER-Launch-details-zeecinemalu

వెంకీ , వరుణ్

వెంకటేష్ కామెడీ టైమింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ‘ఎఫ్ 2’ లో తన కామెడీ తో  హిలేరియస్ గా నవ్వించి థియేటర్స్ లో నవ్వుల పూవులు పూయించిన వెంకీ ఎఫ్౩ లో  ఇంకాస్త ఎక్కువే నవ్వించడానికి రెడీ అయ్యాడు. ఇందులో రే చీకటి ఉన్న కేరెక్టర్ తో కడుపుబ్బా నవ్వించబోతున్నాడు. అసలే వెంకీ కామెడీ టైమింగ్ మాములుగా ఉండదు. దానికి తోడు నైట్ బ్లైండ్ నెస్ అనే ఎలిమెంట్ యాడ్ అయింది. ఇక వెంకీ థియేటర్స్ లో ఆడియన్స్ ని పగలపడి నవ్వించడం ఖాయం. అలాగే వరుణ్ తేజ్ కూడా ఈసారి ఇంకా ఎక్కువ నవ్వించబోతున్నాడు. నోరు తిరగని నత్తితో మాట్లాడుతూ మంచి వినోదం పంచబోతున్నాడు. ఇప్పటికే వరుణ్ ట్రైలర్ లో  నత్తితో చెప్పిన మెగా ఫ్యామిలీ డైలాగ్ బాగా క్లిక్ అయింది. ఆ సీన్ చూస్తే వరుణ్ కేరెక్టర్ ఇందులో బాగా పెలనుందనిపిస్తుంది.

f3 movie

అనీల్ రావిపూడి మార్క్ ఎంటర్టైన్ మెంట్

టాలీవుడ్ లో కామెడీ సినిమాలను పర్ఫెక్ట్ గా డీల్ చేసే నేటి దర్శకుడిగా అనిల్ రావిపూడి మంచి గుర్తింపు అందుకున్నాడు. ‘ఎఫ్ 2’ ని అనిల్ తీసిన విధానం అందరినీ అలరించింది. పైగా ఈసారి ఫ్రాంచైజీ కోసం అందరికీ కనెక్ట్ అయ్యే ఫైనాన్స్ ఎలిమెంట్ మీద కథ ఎంచుకున్నాడు. ఈసారి ఫన్ , ఫ్రస్ట్రేషన్ తో పాటు ఫైనాన్స్ కూడా యాడ్ అయింది కాబట్టి అనిల్ తన స్టైల్ ఆఫ్ ఎంటర్టైన్ మెంట్ తో మెప్పించడం ఖాయమనిపిస్తుంది. పైగా ఇందులో చాలా మంది నటీ నటులను పెట్టుకొని ఒక్కో కేరెక్టర్ తో ఒక్కో ఫన్ సీన్ క్రియేట్ చేసి టికెట్టు కొన్న ఆడియన్స్ కి ఫన్ తో ఫుల్ మీల్స్ పెట్టబోతున్నాడు.

f3 new release date

దిల్ రాజు ప్రొడక్షన్

కొన్ని సినిమాలు ప్రొడక్షన్ బట్టి చూస్తారు ప్రేక్షకులు. కొందరు నిర్మాతలకి ఉన్న టేస్ట్ , ప్రొడక్షన్ వేల్యూస్ సినిమాను మరింత ఉన్నత స్థాయికి తీసుకెళ్తాయి. దిల్ రాజు ప్రొడక్షన్  అంటే ఓ బ్రాండ్ ఉంది. ఆ బ్రాండ్ నుండి వచ్చే సినిమాపై మంచి అంచనాలుంటాయి. ‘ఎఫ్ 2’ ని మంచి ప్రొడక్షన్ వేల్యూస్ తో చూపించిన దిల్ రాజు ఈసారి ‘ఎఫ్ ౩’ కి  మరింత బడ్జెట్ పెట్టి గ్రాండ్ గా నిర్మించారు. ఈ సినిమా కోసం అనుకున్న బడ్జెట్ కంటే ఎక్కువే ఖర్చు పెట్టి క్వాలిటీ ప్రొడక్ట్ డెలివరీ చేశారు. సో క్వాలిటీ పరంగా ఈ సినిమా థియేటర్స్ లో మంచి ఎక్స్ పీరియన్స్ ఇవ్వడం పక్కా.

f3 movie venkatesh varun tej tamanna

తమన్నా , మెహ్రీన్ గ్లామర్

‘ఎఫ్ 2’ కి తమన్నా , మెహ్రీన్ యాక్టింగ్ తో పాటు గ్లామర్ కూడా ప్లస్ అయ్యింది. అందులో  వీరిద్దరూ ఓ సాంగ్ లో హాట్ అందాలతో రెచ్చిపోయి యూత్ ని ఎట్రాక్ట్ చేశారు. అలాగే కొన్ని సీన్స్ లో భర్తలను హింసించే భార్యలుగా మంచి కామెడీ పండించారు. ఇప్పుడు ఇందులో కూడా అలాంటి హిలేరియస్ సీన్స్ చాలానే ఉన్నాయని తెలుస్తుంది. అలాగే ఓ హాట్ సాంగ్ కూడా ఉంది. ఆ సాంగ్ లో తమన్నా , మెహ్రీన్ రెచ్చిపోయి అందాల ఆరబోత ప్రదర్శించారు. తమన్నా , మెహ్రీన్ పెర్ఫార్మెన్స్,  కేరెక్టర్స్ డిజైనింగ్ తో పాటు Woo Aa Aha Aha సాంగ్ కూడా సినిమాకు మరింత ప్లస్ అవ్వనుంది.

f3 movie pooja hegde (1)

పూజ హెగ్డే స్పెషల్ సాంగ్

జెనరల్ గా కమర్షియల్ సినిమాల్లో స్పెషల్ సాంగ్స్ చూస్తుంటాం. అందులో చిందేసిన హీరోయిన్ కోసం ప్రేక్షకులు మళ్ళీ మళ్ళీ సినిమా చూస్తుంటారు. ‘ఎఫ్ ౩’ లో అలాంటి అదిరిపోయే స్పెషల్ సాంగ్  ఉంది. ‘అద్యక్షా లైఫ్ అంటే మినిమం ఇట్టా ఉండాలా’ అనే సాంగ్ లో టాప్ హీరోయిన్ పూజ హెగ్డే హాట్ స్టెప్స్ వేసి ఎట్రాక్ట్ చేసింది. ఇప్పటికే రిలీజైన లిరికల్  సాంగ్ , ప్రోమో బిట్ థియేటర్స్ లో ఈ సాంగ్ కి ఏ రేంజ్ రచ్చ ఉంటుందో తెలియజేసేలా అనిపిస్తున్నాయి. వెంకీ , వరుణ్ లతో పూజ స్పెషల్ సాంగ్ సినిమాకు హైలైట్ అవ్వనుంది. ఈ సాంగ్ ని ప్రేక్షకులు బాగా ఎంజాయ్ చేస్తారని టీం గట్టిగా చెప్తున్నారు.

f3-movie-11

దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్

ఏ సినిమాకయినా మంచి మ్యూజిక్ పడితే ఇంకాస్త అడ్వాంటేజ్ అవుతుంది. ఎఫ్ 2 కి అదిరిపోయే సాంగ్స్ తో పాటు సీన్స్ కి తగ్గట్టుగా బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఇచ్చిన  దేవి ఈసారి కూడా అదే రేంజ్ మ్యూజిక్ రిపీట్ చేశాడు. తాజాగా ‘ఎఫ్ ౩’ నుండి రిలీజైన అన్ని సాంగ్స్ సూపర్ డూపర్ హిట్ హిట్టయ్యాయి. ఇక బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా సినిమాకు ప్లస్ అయ్యిందని టీం అంటున్నారు. దేవి మ్యూజిక్ కూడా సినిమా చూడటానికి బెస్ట్ రీజన్ గా చెప్పొచ్చు.

ఇవండీ వచ్చే శుక్రవారం రిలీజ్ అవుతున్న ఎఫ్ ౩ చూడటానికి టాప్ 7 రీజన్స్. మరి ఇంకెందుకు ఆలస్యం వెంటనే టికెట్ బుక్ చూసుకొని ‘ఎఫ్3’ ని థియేటర్స్ లో చూసి ఎంజాయ్ చేయండి.

 

  • Follow Us for Latest Telugu Zee Cinemalu News and upcoming trending stories, Gossips, Actress Photos and Special topics