Studio Roundup : షూటింగ్ డీటెయిల్స్

Tuesday,March 09,2021 - 05:10 by Z_CLU

ప్రస్తుతం టాలీవుడ్లో కొన్ని సినిమాలు జెట్ స్పీడులో షూటింగ్స్ జరుపుకుంటున్నాయి. ఇంటరెస్టింగ్ కంటెంట్ తో బిజీ బిజీ షెడ్యూల్స్ తో సెట్స్ పై ఉన్న సినిమాల షూటింగ్ అప్ డేట్స్ మీ కోసం.

మెగాస్టార్ చిరంజీవి – కొరటాల శివ కాంబినేషన్లో తెరకెక్కుతున్న ‘ఆచార్య’ సినిమా షూటింగ్ ఖమ్మం  జిల్లాలోని ఎల్లందులో జరుపుకుంటుంది. ప్రస్తుతం మెగా స్టార్ చిరంజీవి, రామ్ చరణ్ లపై కీలక సన్నివేశాలు తీస్తున్నారు కొరటాల. కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ, మ్యాట్నీ ఎంటర్టైన్ మెంట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాకు మణిశర్మ మ్యూజిక్ ఇస్తున్నాడు.

_________________________________________________________

allu-arjun-pushpa-releases-august-13-zeecinemalu

సుకుమార్ -అల్లు అర్జున్ కాంబోలో తెరకెక్కుతున్న ‘పుష్ప’  శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ఇటివలే తమిళ్ నాడులో కొన్ని సన్నివేశాలు షూట్ చేసుకొచ్చిన యూనిట్ త్వరలోనే హైదరాబాద్ లో మరో షెడ్యుల్ ప్లాన్ చేస్తున్నారు. మైత్రి మూవీ మేకర్స్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ సినిమాలో రష్మిక మందన్న కథానాయికగా నటిస్తోంది. దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ కంపోజ్ చేస్తున్నాడు.

______________________________________________________________

gopichand maruthi pakka commercial movie 2

మ్యచో స్టార్ గోపీచంద్ హీరోగా మారుతి డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ‘పక్కా కమర్షియల్’ సినిమా షూటింగ్ హైదరాబాద్లో జరుగుతుంది. ప్రస్తుతం కోఠీ ఉమెన్స్ కాలేజీలో గోపీచంద్ మిగతా నటీ నటులపై కొన్ని సన్నివేశాలు తీస్తున్నారు. సత్యరాజ్ ఇందులో కీలక పాత్రలో నటిస్తున్నారు. గీతా ఆర్ట్స్ , యూవీ క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమా అక్టోబర్ 1న రిలీజ్ కానుంది.

_______________________________________________________

kartikeya2-shooting-updates-zeecinemalu

చందూ మొండేటి దర్శకత్వంలో నిఖిల్ హీరోగా  తెరకెక్కుతున్న ‘కార్తికేయ2’ షూటింగ్ మొదలైంది. ప్రస్తుతం గుజరాత్ లో సన్నివేశాలు తీస్తున్నారు. తర్వాత  నేపాల్, హరిద్వార్ , కంబోడియాలో షెడ్యుల్స్ ప్లాన్ చేస్తున్నారు. హీరో నిఖిల్ , హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ తో పాటు మరికొందరు నటులు ఈ షెడ్యుల్ లో పాల్గొంటున్నారు. సస్పెన్స్ థ్రిల్లర్ జోనర్ లో రూపొందుతున్న ఈ సినిమాకు కీరవాణి తనయుడు కాలభైరవ సంగీతం అందిస్తున్నాడు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బేనర్స్ పై TG విశ్వ ప్రసాద్, అభిషేక్ అగర్వాల్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమా ఈ ఏడాదిలోనే విడుదల కానుంది.

_________________________________________

varun-tej-ghani-july-30-release2

వరుణ్ తేజ్ హీరోగా తెరకెక్కుతున్న స్పోర్ట్స్ డ్రామా సినిమా ‘గని’ హైదరాబాద్ లో శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. అన్నపూర్ణ ఏడెకరాల్లో వేసిన సెట్ లో ప్రెజెంట్ వరుణ్ తేజ్, నవీన్ చంద్రలపై యాక్షన్ ఎపిసోడ్స్ షూట్ చేస్తున్నారు. వరుణ్ తేజ్ సరసన సయీ మంజ్రేకర్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో ఉపేంద్ర విలన్ గా నటిస్తున్నాడు. సిద్దు, అల్లు వెంకటేష్ నిర్మిస్తున్న ఈ సినిమాకు తమన్ మ్యూజిక్ అందిస్తున్నాడు.

____________________________________________

Vishwak Sen Paagal First Look Film To Release On April 30 zeecinemalu

విశ్వక్ సేన్ హీరోగా న‌రేష్ కుప్పిలి దర్శకుడిగా పరిచయమవుతున్న ‘పాగల్’ సినిమా షూటింగ్ హైదరాబాద్ లో జరుగుతుంది. ప్రస్తుతం గచ్చిబౌలిలో విజయ్ మాస్టర్ కోరియోగ్రఫీలో సాంగ్ షూట్ చేస్తున్నారు. దిల్ రాజు సమర్పణలో బెక్కం వేణుగోపాల్ నిర్మిస్తున్న ఈ సినిమా ఏప్రిల్ 30న రిలీజ్ కానుంది.