జాతి ర‌త్నాలు డైరెక్టర్ అనుదీప్ కేవీ ఇంట‌ర్వ్యూ.

Tuesday,March 09,2021 - 03:43 by Z_CLU

నవీన్ పోలిశెట్టి – రాహుల్ రామకృష్ణ – ప్రియదర్శి ప్రధాన పాత్రలతో తెరకెక్కుతున్న  ‘జాతిరత్నాలు’ మహాశివరాత్రి సందర్భంగా మార్చి 11న ప్రేక్షకుల ముందుకు వ‌స్తోంది.  ఈ సంద‌ర్భంగా చిత్ర ద‌ర్శ‌కుడు అనుదీప్ కేవీ చెప్పిన విశేషాలు..

 

డైరెక్షన్‌ అంటే ఇంట్రెస్ట్

మాది సంగారెడ్డి. అమీర్‌పేటలో డిగ్రీ పూర్తి చేశాను. డిగ్రీ పూర్తయిన తర్వాత మిస్డ్‌కాల్డ్‌ అనే షార్ట్‌ఫిల్మ్‌ చేశాను. స్కూల్‌ డేస్‌నుండే నేను డైరెక్షన్‌ అంటే నాకు ఇంట్రెస్ట్‌. ఉయ్యాల జంపాల సినిమాకు నేను అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా వర్క చేశాను.
సెటైరికల్‌ కామెడీ

Jathi-Ratnalu-march-11-release-naveen-polisetty

ఇంపాక్ట్‌ కనిపిస్తుంది

చట్టాలు, కోర్టులు వంటి వాటి గురించి ఏం తెలియని ఓ ముగ్గురు అమాయకులు ఓ సీరియస్‌ క్రైమ్‌లో చిక్కుకుంటే ఎలా ఉంటుంది? అనే బ్యాక్‌డ్రాప్‌లో ‘జాతిరత్నాలు’ సినిమా కథనం ఉంటుంది. నవీన్, రాహుల్, ప్రియదర్శి, ఫరియా మెయిన్‌ క్యారెక్టర్స్‌ చేసిన వీళ్లే కాదు…సినిమాలో క్యారెక్టర్‌ చేసిన ప్రతివారికి ఇంపాక్ట్‌ కనిపిస్తుంది. సెటైరికల్‌ కామెడీ మూవీ ఇది. కొన్ని సమకాలీన అంశాలను సెటైరికల్, ఫన్నీ వేలో చెప్పాం.

షార్ట్‌ఫిల్మ్‌ చూసి కలిశారు

‘పిట్టగోడ’ నా ఫస్ట్‌ సినిమా. జాతిరత్నాలు నా సెకండ్‌ సినిమా. పిట్టగోడ సినిమా పోస్ట్‌ ప్రొడక్షన్‌ టైమ్‌ సమయంలో నాగ్‌ అశ్విన్‌గారు నేను చేసిన ఓ కామెడీ షార్ట్‌ఫిల్మ్‌ చూసి నన్ను కలిశారు. నా తొలి సినిమా అంతగా ఆడకపోయిన నన్ను బాగా ట్రీట్‌ చేశారు.

Jathi ratnalu

కామెడీగా అనిపిస్తాయి.

ఫస్ట్‌ నవీన్‌ను నాగ్‌అశ్విన్‌ సెలక్ట్‌ చేశారు. మిగతావారిని తీసుకున్నాం. సినిమాలోని వారు ఎక్కడ కామెడీ చేయరు. కానీ వారు చేసే ప‌నులు ఆడియన్స్‌కు కామెడీగా అనిపిస్తాయి. సినిమాలోని సిచ్యువేషన్స్ అన్నీ కూడ క్రేజీగా, కొత్తగా ఉంటాయి.

ఇన్‌పుట్స్‌ తీసుకుంటాను

నాగ్‌అశ్విన్‌గారు ఇచ్చిన ఇన్‌పుట్స్‌ తీసుకున్నాను. సినిమా బాగా రావడానికి ఎవరు ఇన్‌పుట్స్‌ ఇచ్చిన తీసుకుంటాను. హీరో నవీన్‌ కూడ కొన్ని ఇన్‌పుట్స్‌ ఇచ్చారు. నవీన్‌ కోసం కొన్ని ప్రత్యేకమైన సీన్స్‌ రాశాం. కానీ కథ డిస్ట్రబ్‌ కాలేదు.

నాగ్‌అశ్విన్‌ ఈగోలెస్‌ పర్సన్‌

నేను, నాగ్‌అశ్విన్, సమర్‌ మేం ముగ్గురం కలిసి కథను డెవలప్‌ చేశాం. కథ ఎలా ఉండాలి? ఆడియన్స్‌కు ఎలాంటి ట్రీట్‌ ఇద్దామనే అంశాలను కలిసే డిస్కష్‌ చేసుకున్నాం. నాగ్‌అశ్విన్‌ ఈగోలెస్‌ పర్సన్‌. తాను చెప్పిందే జరగాలని అనడు. అందుకే సినిమా అవుట్‌పుట్ ఇంత బాగా వచ్చింది. ఇన్‌పుట్స్‌ ఇచ్చినప్పుడు తీసుకోవడం, తీసుకోక పోవడం అనేది డైరెక్టర్‌గా నా నిర్ణయం.

కామెడీ బ్యాక్‌డ్రాప్‌లో జాతిరత్నాలు

నాగ్‌అశ్విన్‌ సినిమాల్లో ఎమోషన్స్‌ ఉంటాయి. కామెడీ బ్యాక్‌డ్రాప్‌లో జాతిరత్నాలు సినిమా ఉంటుంది. అందుకే నన్ను తీసుకున్నారు. నాగ్‌ అశ్విన్‌ కు కూడ కామెడీ సినిమాలు అంటే ఇష్టమే. ఎమోషన్స్‌లో నవ్వడం అనేది హైయ్యేస్ట్‌ పాయింట్‌.