టాలీవుడ్ పవర్ ఫుల్ ‘డాన్’

Wednesday,August 07,2019 - 10:02 by Z_CLU

‘రణరంగం’ లో శర్వానంద్ డాన్ లా నటించాడు. శర్వా లుక్స్ దగ్గరి నుండి ఆటిట్యూడ్ వరకు ప్రతీది ఆడియెన్స్ కి కనెక్ట్ అవుతున్నాయి.  రిలీజ్ కి ముందే ఇంట్రెస్టింగ్  బజ్ క్రియేట్ చేస్తుంది ‘రణరంగం’. ఈ సినిమాతో సక్సెస్ ఫుల్ గా టాలీవుడ్ ‘డాన్’ ల లిస్టులో చేరిపోయాడు ఈ యంగ్ హీరో.

 

మహేష్ బాబు – ‘సూర్య భాయ్…’ అనగానే మహేష్ బాబు మైండ్ లోకి వస్తాడు. ఆ స్థాయిలో కనెక్టయింది ‘బిజినెస్ మెన్’ సినిమా. ఈ సినిమాలో మహేష్ బాబు డాన్ లా కనిపించాడు.   

నాగార్జున : 2007 లో ‘డాన్’ సినిమా చేశాడు నాగ్. రాఘవ లారెన్స్ డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమాలో స్టైలిష్ డాన్ లా కనిపించి మెస్మరైజ్ చేశాడు.

ప్రభాస్ :  ‘బిల్లా’ లో నటించాడు డాన్ లా. ఈ సినిమాలో డ్యూయల్ రోల్ ప్లే చేసిన ప్రభాస్, స్టైలిష్ మ్యానరిజం తో ఫ్యాన్స్ కి మరింత దగ్గరయ్యాడు.

వెంకటేష్ : ‘షాడో’ సినిమాలో కనిపించాడు ‘డాన్’ లా. అప్పటి వరకు సెంటిమెంట్, యాక్షన్ సినిమాలతో ఎంటర్ టైన్ చేసిన వెంకీ, ఈ సినిమాలో కొత్తగా కనిపించి ఆకట్టుకున్నాడు.

బాలకృష్ణ : ‘సుల్తాన్’ సినిమాలో డాన్ లా నటించాడు బాలయ్య. నెగెటివ్ షేడ్స్ లో అప్పటి వరకు కనిపించని డిఫెరెంట్ రోల్ లో కనిపించాడు.

ఈ వరసలో సీనియర్ మోస్ట్ హీరోలు కూడా ఉన్నారు సీనియర్ NTR ‘యుగంధర్’ సినిమాలో డాన్ లా కనిపిస్తే,  సూపర్ స్టార్ కృష్ణ మానవుడు – దానవుడు, మంచి మిత్రులు లాంటి సినిమాల్లో డాన్ లా కనిపించారు. ఇప్పుడున్న యంగ్ హీరోస్ లో ఎంత మంది ఈ లిస్ట్ లోకి చేరుతారో చూడాలి.