జీ సినిమాలు ( 7th ఆగష్టు )

Tuesday,August 06,2019 - 10:02 by Z_CLU

కథకళి

నటీనటులు : విశాల్కేథరిన్ థెరిసా

ఇతర నటీనటులు : కరుణాస్ఇమ్మన్ అన్నాచిగ్రేస్ కరుణాస్గోపీపవన్మధుసూదన్ రావు మరియు తదితరులు

మ్యూజిక్ డైరెక్టర్ హిప్ హాప్ తమిళ

డైరెక్టర్ : పాండిరాజ్

ప్రొడ్యూసర్ : పాండిరాజ్

రిలీజ్ డేట్ : 18 మార్చి 2016 

విశాల్కేథరిన్ థెరిసా జంటగా నటించిన లవ్ & యాక్షన్ ఎంటర్ టైనర్ కథకళి. U.S. లో స్టడీస్ కంప్లీట్ చేసుకుని ఇండియాకి వచ్చిన కమల్ ( విశాల్ ) అనుకోకుండాసాంబ అనే వ్యక్తి మర్డర్ కేస్ లో ఇరుక్కుంటాడు. కమల కుటుంబానికిసాంబ కుటుంబానికి చాలా కాలం నుండి వ్యక్తిగత కక్షలుండటంతో పోలీసులు కమల్ ని అనుమానిస్తుంటారు. అయితే నిజానికి ఆ హత్య చేసింది ఎవరు…? అసలు హీరో ఫ్యామిలీకిసాంబ ఫ్యామిలీకి మధ్య ఎందుకు చెడింది..అనేది ఈ సినిమాలో ప్రధాన కథాంశం. హీరో విశాల్కేథరిన్ థెరిసా కి మధ్య ఉండే రొమాంటిక్ ట్రాక్ సినిమాలో హైలెట్ గా నిలుస్తుంది.

==============================================================================

 

 గ్రీకువీరుడు

నటీనటులు : నాగార్జున అక్కినేనినయనతార

ఇతర నటీనటులు : మీరా చోప్రా, K. విశ్వనాథ్ఆశిష్ విద్యార్థిబ్రహ్మానందంకోట శ్రీనివాస రావుఆలీ, M.S. నారాయణధర్మవరపు సుబ్రహ్మణ్యం తదితరులు

మ్యూజిక్ డైరెక్టర్ : S.S. తమన్

డైరెక్టర్ : దశరథ్

ప్రొడ్యూసర్ : D. శివ ప్రసాద్ రెడ్డి

రిలీజ్ డేట్ : 3 మే 2013

దశరథ్ డైరెక్షన్ లో తెరకెక్కిన రొమాంటిక్ ఎంటర్ టైనర్ గ్రీకు వీరుడు. ఒంటరిగా విదేశాల్లో పెరిగికుటుంబమంటే ఏంటో తెలియని యువకుడిగా నాగార్జున నటన సినిమాకే హైలెట్. నయన తార అసలు నాగార్జున జీవితంలోకి ఎలా అడుగు పెడుతుంది. ఆ తరవాత వారిద్దరి జీవితం ఎలాంటి మలుపులు తిరుగుతుందనేదే ప్రధాన కథాంశం. ఈ సినిమాకి S.S. తమన్ సంగీతం అందించాడు.

=============================================================================

వసంతం 

నటీనటులు : వెంకటేష్ఆర్తి అగర్వాల్కళ్యాణి

ఇతర నటీనటులు : V.V.S. లక్ష్మణ్ఆకాష్సునీల్చంద్ర మోహన్తనికెళ్ళ భరణిధర్మవరపు సుబ్రహ్మణ్యం మరియు తదితరులు

మ్యూజిక్ డైరెక్టర్ : S.A. రాజ్ కుమార్

డైరెక్టర్ : విక్రమన్

ప్రొడ్యూసర్ : N.V. ప్రసాద్

రిలీజ్ డేట్ : 11 జూలై 2003

స్నేహానికిప్రేమకు మధ్య డిఫెరెన్స్ ని అద్భుతంగా ఎలివేట్ చేసిన ఫ్యామిలీ ఎంటర్ టైనర్ వసంతం. ఎంత పెద్ద త్యాగానికైనా వెనకాడని ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ కథే ఈ సినిమా. ఇమోషనల్ సీన్స్ సినిమాకి హైలెట్ గా నిలుస్తాయి.

==============================================================================

ముత్తు

నటీనటులు : రజినీకాంత్మీనా

ఇతర నటీనటులు : రఘువరన్శరత్ బాబుజయ భారతివడివేలుకాంతిమతిరాధా రవి మరియు తదితరులు

మ్యూజిక్ డైరెక్టర్ : A.R. రెహమాన్

డైరెక్టర్ : K.S. రవికుమార్

ప్రొడ్యూసర్ : రాజం బాలచందర్

రిలీజ్ డేట్ : 23 అక్టోబర్ 1995

సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా నటించిన ముత్తు సెన్సేషనల్ హిట్ అయింది. రాకుమారుడైన ముత్తుఅతని కుటుంబ సభ్యులు చేసిన కుట్ర వల్ల పనివాడిలా పెరుగుతాడు. పెరిగి పెద్దవాడైన ముత్తు తన అధికారాన్ని ఎలా సాధించుకున్నాడు. అనేదే ఈ సినిమా ప్రధాన కథాంశం.

==============================================================================

ఉన్నది ఒకటే జిందగీ

నటీనటులు రామ్ పోతినేనిఅనుపమ పరమేశ్వరన్లావణ్య త్రిపాఠి

ఇతర నటీనటులు : శ్రీ విష్ణుప్రియదర్శికిరీటి దామరాజుహిమజఅనీషా ఆంబ్రోస్ మరియు తదితరులు

మ్యూజిక్ డైరెక్టర్ : దేవి శ్రీ ప్రసాద్

డైరెక్టర్ : కిషోర్ తిరుమల

ప్రొడ్యూసర్ : కృష్ణ చైతన్యస్రవంతి రవి కిషోర్

రిలీజ్ డేట్ : 27 అక్టోబర్ 2017

అభి(రామ్) – వాసు(శ్రీ విష్ణు) ఒకరిని వదిలి ఒకరు ఉండలేని ప్రాణ స్నేహితులు.  చిన్నతనం నుంచి బెస్ట్ ఫ్రెండ్స్ గా  జీవితాన్ని గడుపుతున్న అభి – వాసు జీవితంలోకి  అనుకోకుండా మహా(అనుపమ) అనే అమ్మాయి ఎంటర్ అవుతుంది.  స్నేహితుడు తర్వాతే ఇంకెవరైనా అనుకునే అభి- వాసులు మహా వల్ల నాలుగేళ్లు  దూరమవుతారు. ఇంతకీ మహా ఎవరు. ఒకరినొకరు వదిలి ఉండలేని అభి – వాసులు ఎందుకు విడిపోయారు.. చివరికి మళ్ళీ ఎలా కలిశారు..అనేది తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే.

==============================================================================

ఒక్కడొచ్చాడు

నటీనటులు : విశాల్తమన్నా

ఇతర నటీనటులు : వడివేలుజగపతి బాబుసూరితరుణ్ అరోరాజయప్రకాష్నిరోషా మరియు తదితరులు

మ్యూజిక్ డైరెక్టర్ : హిప్ హాప్ తమిజా

డైరెక్టర్ : సూరజ్

ప్రొడ్యూసర్ : S. నంద గోపాల్

రిలీజ్ డేట్ : 23 డిసెంబర్ 2016

డీజీపీ చంద్రబోస్ (జగపతిబాబు) ఒక ధైర్యవంతుడైన పోలీస్ ఆఫీసర్. అతను దేవా (సంపత్) నుండి 50 కోట్ల డబ్బు రికవర్ చేస్తాడు. సరిగ్గా అప్పుడే సిటీకి వచ్చిన అర్జున్ (విశాల్) దివ్య (తమన్నా) ని ప్రేమిస్తాడు. డీజీపీ చంద్రబోస్ చెల్లి అయిన దివ్య కూడా అతని బ్యాక్ గ్రౌండ్ ఏం తెలుసుకోకుండానే అతనితో లవ్ లో పడిపోతుంది. దివ్య ప్రేమని అంగీకరించిన చంద్రబోస్ పెళ్లి చేయడానికి ఏర్పాట్లు చేసే సమయంలో అర్జున్ తాను ఒక సిబిఐ ఆఫీసర్ అని చెప్తాడు. అంతేకాదు డీజీపీ దగ్గరనుండి 250 కోట్లు స్వాధీనం చేసుకుంటాడు. కానీ అక్కడే ఒక ట్విస్ట్ రివీల్ అవుతుంది. అదేంటి…? అనేది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే.