RamaraoOnDuty టీజర్ తో అంచనాలు పెంచేసిన రవితేజ !

Tuesday,March 01,2022 - 04:52 by Z_CLU

Teaser talk on Raviteja’s ‘Ramarao on Duty’

మాస్ మహారాజా రవితేజ అప్ కమింగ్ మూవీ ‘రామారావు ఆన్ డ్యూటీ’ టీజర్ విడుదలైంది. శరత్ మండవ దర్శకుడిగా పరిచయమవుతున్న ఈ సినిమా టీజర్ ఆకట్టుకుంది. రవితేజ నుండి ప్రేక్షకులు ఆశించే అన్ని అంశాలు సినిమాలో పుష్కలంగా ఉంటాయని టీజర్ తో క్లియర్ కట్ గా చెప్పేశారు మేకర్స్. ముఖ్యంగా యాక్షన్ ఎపిసోడ్స్ మాస్ ఆడియన్స్ ని ఎట్రాక్ట్ చేసేలా కంపోజ్ చేశారని టీజర్ చూస్తుంటే తెలుస్తుంది. సినిమాలో రవితేజ మండల రెవెన్యూ ఆఫీసర్ గా  పవర్ ఫుల్ క్యారెక్టర్ లో కనిపించనున్నాడు.

సమాజంలో ఉన్న క్రిమినల్స్ పై ఒక ఒక ప్రభుత్వ ఉద్యోగి ఎలా ఎదురుతిరిగాడు అనే కథతో ఈ సినిమా తెరకెక్కుతుందని టీజర్ తో క్లారిటీ ఇచ్చారు. వాడు సూపర్ మెన్ అంటూ తనికెళ్ళ భరణి చెప్పగానే రవితేజ రెండు చేతులతో సిన్సియర్ గా పనిచేయడం షార్ట్స్ క్యారెక్టర్ ని ఎలివేట్ చేస్తూ సినిమాపై ఎక్స్ పెక్టేషన్స్ పెంచేశాయి. టీజర్ లో “ఆయుధం మీద ఆధార పడే నీలాంటి వాడి ధైర్యం వాడే ఆయుధంలో ఉంటుంది.. ఆయుధంలా బ్రతికే నాలాంటి వాడి ధైర్యం అణువణువునా ఉంటుంది” అంటూ రవితేజ చెప్పిన డైలాగ్ ఆకట్టుకుంది. సినిమాలో నటుడు వేణు ఓ ఇంపార్టెంట్ రోల్ లో కనిపించనున్నాడు. వేణు డైలాగ్ తో వచ్చే సీన్ తో కథలో తన ఇంపార్టెన్స్ తెలియజేశారు.

ఓవరాల్ గా రవితేజ క్యారెక్టరైజేషణ్ తాలూకు సన్నివేశాలు , యాక్షన్ ఎపిసోడ్స్ తో తాలూకు కట్స్ , సామ్ CS మ్యూజిక్ , సత్యాన్ సూరన్ విజువల్స్ ‘రామారావు’ టీజర్ ని ఆకట్టుకునేలా చేశాయి. టీజర్ ఎండింగ్ లో కమింగ్ సూన్ అంటూ త్వరలోనే సినిమా థియేటర్స్ లోకి వస్తుందని చెప్పారు. శ్రీ లక్ష్మి వెంకటేశ్వర సినిమాస్ బేనర్ పై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్న ఈ సినిమాలో రవితేజ సరసన దివ్యాన్ష కౌశిక్ , రజిష విజయన్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. సమ్మర్ లో విడుదల కానున్న ఈ సినిమాకు సంబంధించి త్వరలోనే రిలీజ్ డేట్ ప్రకటించనున్నారు.

Follow Us for Latest Telugu Zee Cinemalu News and upcoming trending stories, Gossips, Actress Photos and Special topics