Radheshyam రేపటి నుండి భారీ ప్రమోషన్స్

Tuesday,March 01,2022 - 03:50 by Z_CLU

Prabhas ‘Radheshyam’ Crazy Promotions kick starts from Tomorrow in Mumbai

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ , పూజ హెగ్డే జంటగా రాధా కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన పీరియాడిక్ లవ్ స్టోరీ ‘రాధే శ్యామ్’ మార్చ్ 11న థియేటర్స్ లోకి రానుంది. ఇటివలే మేకర్స్ ప్రమోషన్స్  స్టార్ట్ చేశారు. థియేటర్స్ దగ్గర కొంతమంది జ్యోతిష్యులతో జాతకాలు చెప్పిస్తూ థీమ్ ప్రమోషన్ చేస్తున్నారు. మరో పక్క డైరెక్టర్ , టెక్నీషియన్స్ ఇంటర్వ్యూస్ వస్తూనే ఉన్నాయి. కానీ ప్రభాస్ ప్రమోషన్స్ లో పాల్గొనే రోజు కోసం ఎదురుచూస్తున్నారు ఫ్యాన్స్. ప్రభాస్ ప్రమోషన్స్ లో పార్టిసిపెట్ చేస్తే చాలు సినిమా ప్రచారం  నెక్స్ట్ లెవెల్ కి వెళ్తుంది. అయితే రేపటి నుండే ఈ సినిమా ప్రమోషన్స్ ని వేగవంతం చేసేందుకు రెడీ అవుతున్నాడు ప్రభాస్.

రేపు నిమిషం నిడివితో ఓ ట్రైలర్ వదులుతున్నారు మేకర్స్. ఇందుకోసం ముంబైలో ఓ ఈవెంట్ ఏర్పాటు చేశారు. ఈ ఈవెంట్ లోనే ప్రభాస్ ట్రైలర్ రిలీజ్ చేయబోతున్నాడు. సినిమా ఫ్లేవర్ ని తెలియజేసేలా ట్రైలర్ ని కట్ చేశారట. ఈ ట్రైలర్ ఈవెంట్ తో ‘రాధే శ్యామ్’ కి సంబంధించి భారీ ప్రమోషన్స్ మొదలు కానున్నాయి. రేపటి నుండి నాన్ స్టాప్ గా ప్రభాస్ ప్రమోషన్స్ లో పాల్గొనబోతున్నాడు. ముంబై ఈవెంట్ తర్వాత చెన్నై , హైదరాబాద్ , కొచ్చి, డిల్లీ , బెంగుళూరు ఇలా నాన్ స్టాప్ గా ఈవెంట్స్ ప్లాన్ చేస్తున్నారు టీం. ఇప్పటికే టీజర్ , ట్రైలర్ తో భారీ బజ్ క్రియేట్ చేస్తున్న ‘రాధే శ్యామ్’  రేపటి నుండి ప్రభాస్ ఎంట్రీతో ప్రమోషన్స్ లో భారీ స్థాయికి వెళ్లనుంది.

రేపు రిలీజ్ అయ్యే ట్రైలర్ గురించి.. ప్రభాస్ ఫ్యాన్స్ తో పాటు వరల్డ్ వైడ్ గా మూవీ లవర్స్ అంతా ఎదురుచూస్తున్నారు. ఇప్పటి వరకూ రిలీజ్ చేసిన కంటెంట్ అందరినీ ఆకట్టుకుంది. రిలీజ్ ట్రైలర్ లో కూడా  ప్రభాస్ -పూజా హెగ్డే  సీన్స్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్, విజువల్స్ హైలైట్ గా నిలుస్తాయట.

Follow Us for Latest Telugu Zee Cinemalu News and upcoming trending stories, Gossips, Actress Photos and Special topics