కొత్త ఛానెల్ ఓపెన్ చేసిన మిల్కీ బ్యూటీ

Monday,May 04,2020 - 11:52 by Z_CLU

కెరీర్ పరంగా మరో కొత్త ఛానెల్ ఓపెన్ చేసింది తమన్న. ఇప్పటికే తమిళ, తెలుగు భాషల్లో హీరోయిన్ గా క్రేజ్ తెచ్చుకున్న ఈ ముద్దుగుమ్మ.. ఇప్పుడు శాండిల్ వుడ్ పై ఫోకస్ పెట్టింది. త్వరలోనే కన్నడలో ఓ సినిమా చేయబోతోంది.

కన్నడ రాకింగ్ స్టార్ యష్ హీరోగా ఓ సినిమా రాబోతోంది. నర్తన్ దర్శకత్వంలో పాన్-ఇండియన్ మూవీగా రాబోతున్న ఈ సినిమాలో హీరోయిన్ గా తమన్నాను ఫిక్స్ చేశారు. కేజీఎఫ్2 రిలీజైన తర్వాత ఇది సెట్స్ పైకి వస్తుంది.

నిజానికి తమన్నాకు కన్నడ ఫిలిం ఇండస్ట్రీ కొత్తకాదు. జాగ్వార్, కేజీఎఫ్ లో ఆమె ఐటెంసాంగ్స్ చేసింది. ఫుల్ లెంగ్త్ హీరోయిన్ గా ఎంట్రీ ఇవ్వడం మాత్రం ఇదే ఫస్ట్ టైమ్.

కన్నడలో యష్ ఇప్పుడు మంచి ఫామ్ మీదున్నాడు. ఇలాంటి హీరో సరసన ఛాన్స్ అంటే ఇండస్ట్రీలో ఆటోమేటిగ్గా గుర్తింపు వస్తుంది. తమన్న ఇప్పుడు చేసిందదే.