హాట్ టాపిక్: ఊహించని కాంబో

Monday,May 04,2020 - 11:55 by Z_CLU

లాక్ డౌన్ వల్ల అందరూ ఇళ్లకే పరిమితం అవుతున్నారు. ఈ సమయంలో ఓ మల్టీ స్టారర్ గాసిప్ అందరికీ షాకిచ్చింది. అవును… పవన్, నాని, నాగచైతన్య కలిసి ఓ సినిమా చేస్తారనేది ఆ గాసిప్.

నిజానికి పవన్ కళ్యాణ్ సినిమా కి సంబంధించి ఏదైనా మేటర్ వస్తే చాలు ఫ్యాన్స్ సంబరాలు చేసుకుంటారు. అలాంటిది పవన్ మరో ఇద్దరు యంగ్ హీరోలతో సినిమా అనగానే అంతా ఇటువైపు చూశారు.

ఈ కాంబినేషన్ లో సినిమాకు కథను దర్శకుడు దశరథ్ రాశాడని, త్రివిక్రమ్ డైరక్ట్ చేస్తాడని అంటున్నారు. పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్, అన్నపూర్ణ స్టూడియోస్, వాల్ పోస్టర్ సినిమా… ఇలా ఈ ముగ్గురు హీరోల సొంత బ్యానర్లు ఈ సినిమాను నిర్మిస్తాయని అంటున్నారు.

ఈ గాసిప్ లో నిజమెంత అనే విషయాన్ని పక్కనపెడితే, వినడానికి మాత్రం చాలా బాగుంది. అందుకే ఫిలింనగర్ లో ఇప్పుడిదే హాట్ టాపిక్ గా మారింది.