శీతాకాలం గుర్తుందా అంటున్న తమన్న

Tuesday,August 25,2020 - 06:05 by Z_CLU

తెలుగులో ఈమధ్య కొత్తగా ఓ సినిమా ఒప్పుకుంది తమన్న. కన్నడంలో హిట్టయిన “లవ్ మాక్ టైల్” సినిమా రీమేక్ లో ఆమె నటించనుంది. తాజాగా ఈ సినిమాకు టైటిల్ ఫిక్స్ చేశారు. SatyaDev హీరోగా, మిల్కీబ్యూటీ Tamanna హీరోయిన్ గా నటించనున్న ఈ రీమేక్ ప్రాజెక్టుకు “గుర్తుందా శీతాకాలం” అనే టైటిల్ ఫిక్స్ చేశారు.

27న ఈ సినిమాను అఫీషియల్ గా లాంఛ్ చేయబోతున్నారు. అంతేకాదు.. ఆ వెంటనే ఫస్ట్ షెడ్యూల్ కూడా స్టార్ట్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.

నాగశేఖర్ అనే వ్యక్తి Gurtundha Seetakalam సినిమాను డైరక్ట్ చేయబోతున్నాడు. అతడే నిర్మాత కూడా. కీరవాణి తనయుడు కాలభైరవ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు.