సత్యదేవ్-తమన్నా కాంబినేషన్ లో సినిమా

Wednesday,July 15,2020 - 12:31 by Z_CLU

డిఫరెంట్ కాన్సెప్ట్ సినిమాలతో తనదైన శైలిలో నటిస్తూ తెలుగు ప్రేక్షకుల అభిమానాన్ని సొంతం చేసుకున్నాడు యంగ్ హీరో సత్య దేవ్. ఇక తెలుగునాట మిల్కీ బ్యూటీ తమన్నా కి ఉన్న స్టార్ డం గురించి వేరేగా చెప్పాల్సిన అవసరం లేదు. వీరిద్దరూ జంటగా ఓ సినిమా రాబోతోంది.

కన్నడలో లవ్ మాక్ టైల్ అనే సినిమా ఈమధ్య కాలంలో సూపర్ హిట్టయింది. ఇప్పుడీ సినిమా తెలుగు రీమేక్ లో సత్యదేవ్-తమన్న హీరోహీరోయిన్లుగా నటించబోతున్నారు.

నాగ శేఖర్ మూవీస్ బ్యానర్ పై ప్రొడక్షన్ నెంబర్ 1గా భావన రవి నిర్మాతగా నాగ శేఖర్ స్వీయ నిర్మాణ దర్సకత్వంలో ఈ రీమేక్ రాబోతోంది. ఈ చిత్రానికి సంబంధించిన రెగ్యులర్ షూటింగ్ ని సెప్టెంబర్ మధ్య వారంలో స్టార్ట్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లుగా దర్శక నిర్మాత నాగ శేఖర్ తెలిపారు.

ఈ చిత్రానికి కీరవాణి వారసుడు కాలభైరవ సంగీతాన్ని అందిస్తున్నాడు. సత్య హెగ్డే సినిమాటోగ్రాఫర్ గా వర్క్ చేయబోతున్నాడు. ఇక ఈ సినిమాకి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే అధికారికంగా ప్రకటిస్తామని దర్శక నిర్మాత నాగ శేఖర్ అన్నారు.