కల్యాణ్ రామ్ సరసన తమన్న

Saturday,August 26,2017 - 03:00 by Z_CLU

సినిమాల విషయంలో స్పీడ్ పెంచడమే కాదు, తన ప్రాజెక్టులకు స్టార్ హీరోయిన్లను కూడా తీసుకుంటున్నాడు కల్యాణ్ రామ్. ఇంతకుముందు కొత్త హీరోయిన్లకు అవకాశాలిచ్చిన ఈ హీరో, ఇప్పుడు బ్యాక్ టు బ్యాక్ స్టార్ హీరోయిన్లను తన సినిమాల కోసం తీసుకుంటున్నాడు.

ప్రస్తుతం ఎమ్మెల్యే అనే సినిమా చేస్తున్నాడు కల్యామ్ రామ్. ఈ సినిమాలో కాజల్ హీరోయిన్ గా నటిస్తోంది. ఈ మూవీతో పాటు వచ్చేనెల నుంచి మరో సినిమాను సెట్స్ పైకి తీసుకురాబోతున్నాడు ఈ నందమూరి హీరో. జయేంద్ర దర్శకత్వంలో ప్రారంభం కానున్న ఈ సినిమాలో హీరోయిన్ గా మిల్కీబ్యూటీ తమన్నను తీసుకున్నారు.

వచ్చేనెల నుంచి కల్యామ్ రామ్, తమన్న హీరోయిన్లుగా కొత్త సినిమా రెగ్యులర్ షూటింగ్ ఉంటుంది. పీసీ శ్రీరామ్ ఈ సినిమాకు సినిమాటోగ్రాఫర్. ఓ డిఫరెంట్ లవ్ సబ్జెక్ట్ తో ఈ సినిమా రాబోతోంది.