OTT Review - మా నీళ్ళ ట్యాంక్ (జీ 5)

Friday,July 15,2022 - 03:48 by Z_CLU

Sushanth’s ‘Maa Neella Tank’ Review

నటీ నటులు : సుశాంత్ , ప్రియా ఆనంద్ , సుదర్శన్ , ప్రేమ్ సాగర్ , నిరోష , దివి ,అన్నపూర్ణమ్మ , అప్పాజీ అంబరీష, బిందు, సందీప్ , లావణ్య తదితరులు

సంగీతం : నరేన్ ఆర్కే సిద్దార్థ్

కెమెరా : అరవింద్ విశ్వనాధ్

డైలాగ్స్ : కిట్టు విస్సప్రగడ

ఎడిటింగ్ : కోటగిరి వెంకటేశ్వరరావు

స్టోరీ – స్క్రీన్ ప్లే : రాజ్ శ్రీ బిశ్ట్ , సురేష్ మైసూర్

నిర్మాత : ప్రవీణ్ కొల్ల

దర్శకత్వం : లక్ష్మి సౌజన్య

OTT : ZEE 5

స్ట్రీమింగ్ డేట్ : 15 జులై 2022

మా నీళ్ళ ట్యాంక్ అనే టైటిల్ తో సుశాంత్ , ప్రియ ఆనంద్ జంటగా లక్ష్మి సౌజన్య తెరకెక్కించిన వెబ్ సిరీస్ జీ 5 లో రిలీజైంది. హిలేరియస్ ఫన్ రైడ్ గా తెరకెక్కిన ఈ సిరీస్ OTT ప్రేక్షకులను మెప్పించిందా ?

Actress Priya Anand Re-entry with 'Maa neella tank' series

Actress Priya Anand Re-entry with ‘Maa neella tank’ series

కథేంటి :

బుచ్చివోలు కి చెందిన సురేఖ (ప్రియా ఆనంద్) ఎవరికీ చెప్పకుండా ఊరి నుండి పారిపోతుంది. దీంతో గ్రామ సర్పంచ్ కోదండం (ప్రేమ్ సాగర్ ) కొడుకు గోపాల్ (సుదర్శన్) తను ప్రేమించిన సురేఖ కనిపించకపోకపోవడంతో తన తండ్రే ఆమెకి కిడ్నాప్ చేయించాడని ఆమె తిరిగి వచ్చే వరకూ ట్యాంక్ దిగనని ఆమె జాడ తెలియకపోతే దూకి చస్తానని బెదిరిస్తాడు. దీంతో సురేఖ ని వెతికి మళ్ళీ ఊరికి తీసుకొచ్చే బాధ్యతను పోలీస్ అయిన వంశీ (సుశాంత్) కి అప్పజేప్తాడు ప్రెసిడెంట్.

సురేఖని పట్టుకొస్తే ఆ సర్పంచ్ వేరే ఊరికి ట్రాన్స్ఫర్ రికమండ్ చేస్తాడనే ఉద్దేశ్యంతో వంశీ ఆమె జాడ వెతుకుతూ ప్రయాణం మొదలు పెడతాడు. ఫైనల్ గా వంశీ సురేఖ ని పట్టుకొచ్చి ఊళ్ళోకి తీసుకొస్తాడు. వెంటనే గ్రామ సర్పంచ్ కొడుకు గోపాళం ట్యాంక్ నుండి కిందకి దిగి ఆమెతో తనకి పెళ్లి చేయాలని తల్లిదండ్రుల దగ్గర మారాం చేస్తాడు. కానీ గోపాలంతో పెళ్లి ఇష్టం లేని సురేఖ వంశీ కి దగ్గరవుతుంది. అతని ప్రేమలో పడుతుంది. వంశీ కూడా సురేఖని ఇష్టపడతాడు. మరో వైపు ఊళ్ళో నీళ్ళ ట్యాంకు సమస్య కూడా ఉంటుంది. మరి ఈ కథకి క్లైమాక్స్ ఏంటి ? సురేఖ వంశీని పెళ్లి చేసుకుందా ? నీళ్ళ ట్యాంక్ ని బాగు చేయించిందెవరు ? అనేది మిగతా కథ.

 

నటీ నటుల పనితీరు :

నిజానికి ఏ కథకయినా కేరెక్టర్స్ కి బెస్ట్ ఇచ్చే నటీ నటులు దొరకడం ముఖ్యం. ఈ సిరీస్ లో అందరూ తమ కేరెక్టర్స్ కి బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇచ్చారు. వంశీగా సుశాంత్ బాగా నటించాడు. కామిక్ పోలీస్ పాత్రలో అలరించాడు. ముఖ్యంగా రాయలసీమ యాసలో సుశాంత్ చెప్పే డైలాగులు ఆకట్టుకున్నాయి. చాలా ఏళ్ల తర్వాత ఈ సిరీస్ తో రీ ఎంట్రీ ఇచ్చిన ప్రియా ఆనంద్ సురేఖ పాత్రలో మెప్పించింది. పల్లెటూరి అమ్మాయిగా ఆకట్టుకుంది. గోపాల్ గా సుదర్శన్ సిరీస్ హైలైట్ అనిపించుకున్నాడు. తన కామెడీతో హిలేరియస్ గా ఎంటర్టైన్ చేసి నటుడిగా మంచి మార్కులు అందుకున్నాడు. కోదండంగా ప్రేమ్ సాగర్, చాముండిగా నిరోషా, నరసింహం గా రామరాజు, రమ్యగా దివి, బూనెమ్మగా అన్నపూర్ణమ్మ ,రమణగా అప్పాజీ అంబరీష, భార్గవిగా బిందు చంద్రమౌళి, సుబ్బుగా సందీప్ వారణాసి,రేవతిగా లావణ్య రెడ్డి అలరించారు. మిగతా నటీ నటులంతా తమ పాత్రలకు న్యాయం చేశారు.

 

సాంకేతిక వర్గం పనితీరు :

ఇక సిరీస్ కి తన మ్యూజిక్ తో ప్లస్ అయ్యాడు నరేన్ ఆర్కే సిద్దార్థ్ . అక్కడక్కడా వచ్చే స్కోర్ ఆకట్టుకుంది. అరవింద్ విశ్వనాధ్ కెమెరా వర్క్ బాగుంది. నేచురల్ లోకేషన్స్ ని పర్ఫెక్ట్ క్యాప్చర్ చేసి మంచి విజువల్స్ అందించాడు. కిట్టు విస్సప్రగడ అందించిన డైలాగ్స్ ఆకట్టుకున్నాయి. కోటగిరి వెంకటేశ్వర ఎడిటింగ్ బాగుంది. దర్శకురాలిగా లక్ష్మి సౌజన్య సిరీస్ ని బాగా హ్యాండిల్ చేశారు. ముఖ్యంగా కామెడీ సన్నివేశాలను ఆమె తెరకెక్కించిన విధానం ఆకట్టుకుంది. ప్రొడక్షన్ వేల్యూస్ బాగున్నాయి.

Maa Neella Tank' Promos are very intresting zeecinemalu

ఎలా ఉందంటే ?

కామెడీ కథను సిరీస్ గా తెరకెక్కించడం అంటే సాహసమనే చెప్పాలి. అవును ఏడెనిమిది ఎపిసోడ్స్ లో నవ్విస్తూ డ్రామా పండించడం అంటే మాములు విషయం కాదు. మా నీళ్ళ ట్యాంక్ కి సంబంధించి ఆ రిస్క్ చేశారు మేకర్స్. అందుకు ముందుగా మెచ్చుకోవాలి. బుచ్చివోలు అనే పల్లెటూరు, అక్కడ ఉండే మనుషులు, వారి జీవనాన్ని అద్దం పట్టేలా చూపిస్తూ ఈ సిరీస్ ద్వారా ప్రేక్షకులకు మంచి వినోదం పంచారు దర్శకురాలు లక్ష్మి సౌజన్య. తనకి ఇచ్చిన కథకి న్యాయం చేస్తూ ఆమె తీసిన విధానం ఆకట్టుకుంటుంది. కాకపోతే అక్కడక్కడా నెమ్మదిగా సాగడం ఒక్కటే మైనస్ అనిపిస్తుంది. పాత్రలకు పర్ఫెక్ట్ అనిపించే నటీ నటులను ఎంపిక చేసుకోవడం కూడా సిరీస్ కి హెల్ప్ అయింది.  సుశాంత్ వంశీ పాత్రలో కొత్తగా కనిపిస్తూ మెప్పించాడు. మొదటి ఐదు ఎపిసోడ్స్ కంటే చివరి ఎపిసోడ్స్ లో సుదర్శన్ పాత్ర ద్వారా ఎక్కువ వినోదం అందింది. కోదండం- గోపాల్ మధ్య వచ్చే ఫన్ హిలేరియస్ గా వర్కౌట్ అయింది. ఒకవైపు పల్లెటూరిలో సర్పంచ్ ల మధ్య పొలిటికల్ డ్రామా నడిపిస్తూ , హీరో హీరోయిన్ మధ్య లవ్ ట్రాక్ వేసుకుంటూ సుదర్శన్ పాత్రతో ఎంటర్టైన్ మెంట్ అందించి చివర్లో ఓ చక్కని క్లైమాక్స్ తో సిరీస్ ని ఎండ్ చేశారు. ఓవరాల్ గా మా నీళ్ళ ట్యాంక్ మంచి వినోదం అందించి ఫన్ ఎంటర్టైనర్ గా అలరిస్తుంది.

 

 

  • Follow Us for Latest Telugu Zee Cinemalu News and upcoming trending stories, Gossips, Actress Photos and Special topics