ఆకాశం నీ హద్దురా టీజర్

Tuesday,January 07,2020 - 05:27 by Z_CLU

సూర్య కొత్త సినిమా రెడీ అయింది. సుధా కొంగర దర్శకత్వంలో సూర్య నటిస్తున్న సినిమా ఆకాశం నీ హద్దురా. ఈ సినిమా టీజర్ వచ్చింది. సూర్య నటవిశ్వరూపం కనిపించింది.

సినిమా కోసం మేకోవర్ అవ్వడమే కాదు, యాక్టింగ్ లో కూడా తనదైన మార్క్ చూపిస్తాడు సూర్య. ఆకాశం నీ హద్దురా సినిమా కూడా అలాంటిదే అనే విషయం టీజర్ చూస్తే అర్థమౌతోంది. ఓ సాధారణ కుర్రాడు పెద్ద కల కంటాడు. ఆ కలను సాకారం చేసుకోవడం కోసం ప్రయత్నిస్తాడు. ఈ క్రమంలో అతడు ఎలాంటి అడ్డంకులు ఎదుర్కొన్నాడనే కాన్సెప్ట్ తో ఈ సినిమా తెరకెక్కిందనే విషయం టీజర్ చూస్తే అర్థమౌతోంది.

టీజర్ లో సూర్యకు తప్ప మరో నటుడికి స్కోప్ ఇవ్వలేదు. సినిమాలో సూర్య 2-3 గెటప్స్ లో కనిపిస్తున్నాడు. గురు సినిమాతో నేషన్ వైడ్ పాపులరైన సుధా కొంగర తన రెండో ప్రయత్నంగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. తొలి సినిమా తరహాలోనే రెండో సినిమాకు కూడా ఓ స్ఫూర్తిదాయకమైన కథను ఎంచుకున్నారీమె.

జీవీ ప్రకాష్ సంగీతం అందించిన ఈ సినిమాను 2D ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై స్వయంగా సూర్య నిర్మించాడు. సమ్మర్ ఎట్రాక్షన్ గా థియేటర్లలోకి రాబోతోంది ఈ మూవీ.