'అల... వైకుంఠపురములో' జ్యూక్ బాక్స్ రివ్యూ

Tuesday,January 07,2020 - 04:12 by Z_CLU

‘అల.. వైకుంఠపురములో..’ ఆడియో బ్లాక్ బస్టర్ అయింది. ఒక్క మాటలో చెప్పాలంటే సినిమాలోని ఒక్కో పాట ఇంకో పాటతో పోటీ పడిందనిపించింది. రీసెంట్ టైమ్స్ లో బ్లాక్ బస్టర్ అయిన సింగిల్స్ చాలా ఉన్నాయి కానీ ఇలా కంప్లీట్ ఆల్బమ్ సక్సెసవ్వడం మాత్రం చాలా రేర్.

సామజవరగమనా : సినిమా స్టాండర్డ్స్ ని ఎలివేట్ చేసిందీ సాంగ్. ఈ పాటకి ఈ స్థాయిలో రెస్పాన్స్ వస్తుందని గెస్ చేశారు కాబట్టే… లిరికల్ వీడియోని కూడా ప్రత్యేకంగా సిద్ శ్రీరామ్ పర్ఫామెన్స్ తో రిలీజ్ చేశారు మేకర్స్. ట్రెడిషనల్ లిరిక్స్ ని వెస్టరన్   స్టైల్ లో ప్రెజెంట్ చేసిన ఈ సాంగ్, ఈ సినిమా నుండి ఇంకో పాట ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అనేలా ఆకట్టుకుంటుంది.

రాములో రాములా : అనురాగ్ కులకర్ణి, మంగ్లీ పాడిన సాంగ్. మొదటి పాట క్లాస్ గా మెస్మరైజ్ చేస్తే, ఈ సాంగ్ మాస్ ఆడియెన్స్ ని ‘అల..’ సినిమా వైపు తిరిగి చూసేలా చేసింది.

ఓ మై గాడ్ డాడీ : రిలీజ్ అయిన రోజు నుండే యూత్ కనెక్ట్ అయిపోయింది. సాధారణంగా సాంగ్స్ హిట్టయితే ఎక్కడ పడితే అక్కడ వినిపిస్తూనే ఉంటాయి. కానీ ఈ సాంగ్ యూత్, ఖాళీగా నిలుచుని ఉన్నా… ఏదైనా పని చేసుకుంటూ ఉన్నా తమ ప్రమేయం లేకుండానే హమ్ చేసుకునేంతలా కనెక్టయింది. ఈ సాంగ్ హీరో, హీరో ఫాదర్ కి మధ్య ఉండే రిలేషన్ ని ఎలివేట్ చేస్తుంది.

బుట్టబొమ్మ : ఈ సాంగ్ కూడా హమ్ చేసుకోవడానికి అంతే ఈజీగా ఉంది. అయితే ఈ సాంగ్ లో పూజా హెగ్డేని నెవర్ సీన్ బిఫోర్ స్థాయిలో ప్రెజెంట్ చేశాడట త్రివిక్రమ్. రామజోగయ్య శాస్త్రి రాసిన ఈ పాటని అర్మాన్ మాలిక్ పాడాడు.

అల వైకుంఠపురంలో : టైటిల్ సాంగ్. ఈ పాటని ప్రత్యేకంగా రిలీజ్ చేయకుండా జ్యూక్ బాక్స్ తో పాటే రిలీజ్ చేశారు. ఈ పాట ఆడియో  కన్నా.. సినిమాలోనే ఎక్కువగా ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుందనిపిస్తుంది. ఈ పాటని ప్రియ సిస్టర్స్, శ్రీ కృష్ణ కలిసి పాడారు.