సన్నీలియోన్ హీరోయిన్ గా తెలుగు సినిమా

Monday,December 04,2017 - 11:29 by Z_CLU

బాలీవుడ్ సినిమాలతో క్రేజ్ తెచ్చుకున్న సన్నీలియోన్ మొట్టమొదటిసారిగా తెలుగులో హీరోయిన్ గా ఒక సినిమా సైన్ చేసింది. వి.సి.వడివుడయన్ దర్శకత్వంలో స్టీవ్స్ కార్నర్ పతాకంపై పోన్స్ స్టిఫెన్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సౌత్ ఇండియన్ కల్ఛర్స్ బ్యాక్ డ్రాప్ లో రూపొందున్న ఈ చారిత్రాత్మక యుద్ధ నేపధ్య చిత్రంలో సన్నీలియోన్ కథానాయికగా నటించనుంది. నవదీప్, నాజర్ లు ఈ చిత్రంలో కీలకపాత్రలు పోషించనున్నారు.

ఈ సినిమా కోసం సన్నీలియోన్ కత్తి యుద్ధం, గుర్రపు స్వారీ మరియు కొన్ని యుద్ధ కళలను నేర్చుకోబోతోంది. ఆంధ్రప్రదేశ్ కు చెందిన ఒక ప్రముఖ ట్రైనర్ ఈ కళలను ముంబైలో సన్నీలియోన్ కు నేర్పించబోతున్నాడు. భారీ బడ్జెట్ తో తెరకెక్కనున్న ఈ చిత్రం కోసం సన్నీలియోన్ ఏకంగా 150 రోజుల కాల్షీట్స్ ను దర్శకనిర్మాతలకు ఇచ్చింది.

“బాహుబలి, 2.0” చిత్రాలకు గ్రాఫిక్స్ వర్క్ చేసిన సంస్థలు ఈ చిత్రానికి కూడా పనిచేయనున్నారు. సినిమాలో దాదాపు 70 నిమిషాల గ్రాఫిక్స్ ఉంటాయని చెబుతున్నారు. తెలుగుతోపాటు తమిళ, మలయాళ, హిందీ భాషల్లో రూపొందనున్న ఈ సినిమా టైటిల్ ను త్వరలోనే ఎనౌన్స్ చేస్తారు. 2018 ఫిబ్రవరి నుండి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభమౌతుంది.