సుకుమార్ స్పెషల్ కేర్

Sunday,April 28,2019 - 04:05 by Z_CLU

ప్రస్తుతం ఓ వైపు అల్లు అర్జున్ కోసం కథ సిద్దం చేస్తూనే మరో వైపు శిష్యుడి సినిమాపై స్పెషల్ కేర్ తీసుకున్నాడు సుకుమార్. వైష్ణవ్ తేజ్ హీరోగా తెరకెక్కనున్న సినిమాతో సుక్కు శిష్యుడు బుచ్చి బాబు దర్శకుడిగా పరిచయం అవుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా కథ నుండి అన్ని విషయాల్లో సుకుమార్ కేర్ తీసుకుంటున్నాడు.

కేవలం నిర్మాతగానే కాకుండా దర్శకత్వ పర్యవేక్షణ కూడా చేయనున్నాడట సుకుమార్. ఇప్పటికే ఈ సినిమా కోసం విజయ్ సేతుపతిను విలన్ గా తీసుకున్నారు. దేవి శ్రీ ప్రసాద్ తో మ్యూజిక్ సిట్టింగ్స్ కూడా మొదలుపెట్టేసారు.మ్యూజిక్ సిట్టింగ్స్ లో కూడా సుకుమార్ పాల్గొంటూ దేవి నుండి బెస్ట్ ట్యూన్స్ తీసుకుంటున్నాడట.

సినిమాకు సంబంధించి ఇలా ప్రతీ విషయంలోనూ జాగ్రత్త వహిస్తూ తన గైడెన్స్ తో ప్రాజెక్ట్ ను ముందుకు తీసుకెళ్తున్నాడు సుక్కు. ఎంతైనా శిష్యుడి సినిమా కదా… ఈ మాత్రం కేర్ తప్పనిసరి. మరి ఈ సినిమాతో తన గురువు సుకుమార్ కి బుచ్చి బాబు ఎలాంటి హిట్ అందిస్తాడో..చూడాలి.