Suguna Sundari Song విజువల్ ట్రీట్

Thursday,December 15,2022 - 12:07 by Z_CLU

Suguna Sundari lyrical song from VeeraSimhareddy out now

నందమూరి బాలకృష్ణ, గోపీచంద్ మలినేని కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ‘వీర సింహా రెడ్డి’ (Veerasimhareddy Movie) ఆల్బం నుండి సెకండ్ సింగిల్ “సుగుణ సుందరి”(Suguna sundari song) సాంగ్ రిలీజైంది. జై బాలయ్య అంటూ వచ్చిన ఫస్ట్ సింగిల్ కి మిక్స్డ్ టాక్ వచ్చినప్పటికీ సుగుణ సుందరి విజువల్ గా అలాగే సాంగ్ పరంగా ఆకట్టుకుంది. తమన్ కంపోజ్ చేసిన ఈ ఫాస్ట్ బీట్ సాంగ్ బాలయ్య ఫ్యాన్స్ కి  విజువల్ గా ట్రీట్ ఇచ్చింది. లోకేషన్స్ , బాలయ్య ఎనర్జిటిక్ స్టెప్స్ , శృతి హాసన్ గ్లామర్ తో ఈ సాంగ్ సినిమాకు హైలైట్  అవ్వబోతుందని లిరికల్ సాంగ్ చూస్తే అర్థమవుతుంది.

తమన్ కంపోజ్ చేసిన ఈ సాంగ్ కి రామజోగయ్య శాస్త్రి సాహిత్యం అందించగా క్రేజీ సింగర్ రామ్ మిర్యాల పాడాడు. బాలయ్య కి రామ్ మిర్యాల వాయిస్ సూటవుతుందా ? అనే ప్రశ్నతో సాంగ్ చూసిన మ్యూజిక్ లవర్స్ పర్ఫెక్ట్ గా సూటయిందని భావిస్తున్నారు. మైత్రి మూవీ మేకర్స్ బేనర్ పై నవీన్ యర్నేని , రవి శంకర్ నిర్మిస్తున్న ఈ సినిమాలో దునియా విజయ్, వరలక్ష్మి శరత్‌కుమార్ కీలక పాత్రలు పోషిస్తున్నారు.

సినిమాకు సంబంధించి మరో సాంగ్ షూట్ బ్యాలెన్స్ ఉంది. మాస్ యాక్షన్ సినిమాగా వస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి. జనవరి 12, 2023న సంక్రాంతికి వీర సింహా రెడ్డి ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ థియేట్రికల్ విడుదలకు సిద్ధమవుతోంది.

 

  • Follow Us for Latest Telugu Zee Cinemalu News and upcoming trending stories, Gossips, Actress Photos and Special topics