2022 Year End సూపర్ హిట్ సాంగ్స్ (పార్ట్ 1)

Wednesday,December 14,2022 - 05:12 by Z_CLU

పాట మనకెప్పుడూ హాయినిస్తుంది. అలాగే పాట మనలో జోష్ తీసుకొస్తుంది. అందుకే మన మనసులో పాటలకి  ఓ ప్రత్యేక స్థానం ఉంటుంది. ప్రతీ ఏడాది లాగే ఈ ఇయర్ కూడా కొన్ని సూపర్ హిట్ సాంగ్ మ్యూజిక్ లవర్స్  ని మెస్మరైజ్ చేశాయి. ఈ ఏడాది రిలీజైన (రిలీజ్ డేట్స్ ఆధారంగా) బెస్ట్ సాంగ్స్ ఏంటో ? ఓ లుక్కేద్దాం.

ఈ ఏడాది ఆరంభంలో సంక్రాంతి సీజన్ లో వచ్చిన బంగార్రాజు సినిమలో “బంగారా బుల్లెట్ ఎక్కి వచ్చేయ్రా” సాంగ్ ఆ నెలలో మోస్ట్ పాపులర్ నంబర్ అనిపించుకుంది. లిరికల్  సాంగ్ తో ఎట్రాక్ట్ చేసిన ఈ సాంగ్ విజువల్ గా ఆకట్టుకుంది. అనూప్ రుబెన్స్ మ్యూజిక్ కంపోజ్ చేసిన ఈ సాంగ్ కి భాస్కరభట్ల రవి కుమార్ లిరిక్స్ అందించారు.

సంక్రాంతికి వచ్చిన రౌడీ బాయ్స్ సినిమాలో “బృందావనం నుంచి కృష్ణుడు వచ్చాడే” సాంగ్ కూడా ఇన్స్టంట్ హిట్ నంబర్ అనిపించుకుంది. దేవి శ్రీ ప్రసాద్ కంపోజ్ చేసిన ఈ పాటకు సుద్దాల అశోక్ తేజ సాహిత్యం అందించారు. మంగ్లీ సింగింగ్ కూడా హైలైట్ అనిపించుకుంది.

ఈ ఏడాది రవితేజ -దేవి శ్రీ ప్రసాద్ కాంబినేషన్ లో వచ్చిన “అట్టా సూడకే” సాంగ్ బెస్ట్ ఎనర్జిటిక్ సాంగ్స్ లో ఒకటిగా నిలిచింది. రవితేజ ఎనర్జీకి పర్ఫెక్ట్ ట్యూన్ తో పాటు అదిరిపోయే లిరిక్స్ కుదరడంతో సాంగ్ ఆడియన్స్ కి బాగా నచ్చేసింది. ఖిలాడి సినిమాలోని ఈ సాంగ్ కి శ్రీమణి లిరిక్స్ అందించగా దేవినే స్వయంగా సింగ్ చేశాడు. దేవి తో పాటు సమీర భరద్వాజ్ సింగింగ్ కూడా ప్లస్ అయింది.

2022 లో యూత్ కి కిక్కిచ్చే సాంగ్స్ చాలానే వచ్చాయి. అందులో డీజే టిల్లు టైటిల్ సాంగ్ ఒకటి. సిద్దు జొన్నలగడ్డ హీరోగా తెరకెక్కిన ‘డీజే టిల్లు’ సినిమాలో రామ్ మిర్యాల కంపోజ్ చేసి స్వయంగా పాడిన ఈ సాంగ్ యూత్ కే కాదు కిడ్స్ కి కూడా ఫేవరేట్ అనిపించుకుంది. కాసర్ల శ్యాం అందించిన లిరిక్స్ సాంగ్ ని మరింత ఎలివేట్ చేశాయి. ఓవరాల్ గా 160 మిలియన్ల వ్యూస్ కొల్లగొట్టిన ఈ సాంగ్ సినిమాకే హైలైట్ అనిపించుకుంది.

ఈ ఏడాది సిద్ శ్రీరాం చాలా సాంగ్స్ పాడాడు. అందులో బిగ్గెస్ట్ హిట్ కళావతి. మహేష్ బాబు హీరోగా పరశురాం డైరెక్షన్ లో వచ్చిన ‘సర్కారు వారి పాట’ లో ఈ పాట పెద్ద హిట్ అనిపించుకుంది. తమన్ -సిద్ శ్రీరాం కాంబినేషన్ లో మూడో సాంగ్ గా వచ్చిన కళావతి మ్యూజిక్ లవర్స్ ప్లే లిస్టు లో టాప్ ప్లేస్ అందుకుంది. తమన్ మ్యూజిక్, అనంత్ శ్రీరాం సాహిత్యం , సిద్ శ్రీరాం వాయిస్ అన్ని కలిసి ఈ సాంగ్ ని ఈ ఇయర్ బెస్ట్ సాంగ్స్ లిస్టు లో నిలబెట్టాయి. యూ ట్యూబ్ లో ఓన్లీ లిరికల్ సాంగే 250 మిలియన్ వ్యూస్ కొల్లగొట్టిందంటే కళావతి ఏ రేంజ్ హిట్టో అర్థం చేసుకోవచ్చు.

ఈ ఇయర్ ‘ది వారియర్’ సినిమాలో శింబు పాడిన బులెట్ సాంగ్ చార్ట్ బస్టర్ లో ఫాస్ట్ గా చోటు సంపాదించుకుంది. రామ్ హీరోగా వచ్చిన ఈ సినిమా కోసం దేవి అదిరిపోయే ట్యూన్ ఇవ్వడం ఒకెత్తయితే  శింబు సింగింగ్ మరో ఎత్తు. శ్రీమణి అందించిన లిరిక్స్ కూడా సాంగ్ కి ప్లస్ అయ్యాయి. ఈ ఇయర్ దేవి నుండి వచ్చిన చార్ట్ బస్టర్ సాంగ్స్ లో దీనిదే టాప్ ప్లేస్.

ఈ ఏడాది డబ్బింగ్ సాంగ్స్ లో  “రారా రక్కమ్మ” బెస్ట్ సాంగ్ అనిపించుకుంది. తెలుగులో మంగ్లీ  ఈ సాంగ్ పాడటంతో ఎక్కువ రీచ్ అయ్యింది. అజనీష్ లోకనాథ్ కంపోజ్ చేసిన ఈ పాటకి రామజోగయ్య శాస్త్రి అందించిన లిరిక్స్ కూడా ఆకట్టుకున్నాయి. ఓవరాల్ గా “రా రా రక్కమ్మ” సాంగ్ ఈ ఇయర్ చార్ట్ బస్టర్ లిస్టులో చోటందుకుంది.

  • Follow Us for Latest Telugu Zee Cinemalu News and upcoming trending stories, Gossips, Actress Photos and Special topics