సిద్ధు, శ్రద్ధ శ్రీనాధ్ కాంబినేషన్ లో మరో సినిమా

Friday,October 09,2020 - 07:42 by Z_CLU

టాలీవుడ్ లోని టాప్ ప్రొడక్షన్ హౌజెస్ లో ఒకటైన సితార ఎంటర్టైన్ మెంట్స్ తమ నెక్ట్స్ మూవీ ఎనౌన్స్ చేసింది. యంగ్ హీరో సిద్ధు జొన్నలగడ్డ, హీరోయిన్ శ్రద్ధ శ్రీనాధ్ కాంబోలో ఈ సినిమా రాబోతోంది.

వీరిద్దరూ కలిసి ఇంతకుముందు చేసిన కృష్ణ అండ్ హిజ్ లీల చిత్రానికి ఓటీటీలో మంచి రెస్పాన్స్ వచ్చింది. మళ్లీ వెంటనే ఈ హీరోహీరోయిన్లు ఇద్దరూ ఇలా సితార బ్యానర్ పై కలిశారు.

‘కృష్ణ అండ్ హిజ్ లీల’ చిత్రానికి దర్శకత్వ శాఖలో పనిచేసిన ప్రతిభ గల యువకుడు విమల్ కృష్ణను ఈ చిత్రం ద్వారా దర్శకునిగా పరిచయం చేస్తున్నారు సంస్థ అధినేత సూర్యదేవర నాగవంశీ.

ఈ చిత్రానికి ‘నరుడి బ్రతుకు నటన’ అనే టైటిల్ ఫిక్స్ చేశారు. PDV ప్రసాద్ సమర్పణలో, సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్న ఈ చిత్రం షూటింగ్ దీపావళి కి ప్రారంభం అవుతుంది.

రచన: విమల్ కృష్ణ, సిద్దు జొన్నలగడ్డ
సంగీతం: కాలభైరవ
ఛాయాగ్రహణం: సాయిప్రకాష్
సమర్పణ: పి. డి. వి. ప్రసాద్
నిర్మాత: సూర్యదేవర నాగవంశి
దర్శకత్వం: విమల్ కృష్ణ