శ్రియ పెళ్ళి విషయంలో రియాక్ట్ అయిన శ్రియ తల్లి

Wednesday,February 07,2018 - 02:59 by Z_CLU

బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో బిజీగా ఉంది శ్రియ శరణ్. ఫిబ్రవరి 9 న రిలీజ్ కానున్న గాయత్రి సినిమాలోను కీ రోల్ ప్లే చేసిన శ్రియ, పర్ఫామెన్స్ ఓరియంటెడ్ క్యారెక్టర్స్ తో కరియర్ ని ప్లాన్ చేసుకుంటుంది. ఇదిలా ఉంటే ఈ మధ్య సోషల్ మీడియాలో శ్రియ త్వరలో పెళ్లి చేసుకోనుందనే టాక్ సెన్సేషన్ క్రియేట్ చేసింది. అయితే ఈ రూమర్స్ పై రియాక్ట్ అయింది శ్రియ తల్లి నీరజ.

ప్రస్తుతం శ్రియ కంప్లీట్ ఫోకస్ కరియర్ పైనే ఉందని క్లారిటీ ఇచ్చిన నీరజ, తన పెళ్ళి విషయంలో వస్తున్న న్యూస్ కంప్లీట్ గా రూమరేనని క్లారిటీ ఇచ్చింది. మరికొన్ని రోజుల్లో రాజస్థాన్ లో జరగనున్న తన ఫ్రెండ్ పెళ్ళి కోసం జువెల్లరీ తో పాటు డ్రెస్ డిజైనింగ్ చేయించుకున్న మాట వాస్తవమే, కానీ అది తన పెళ్ళి కోసం కాదని చెప్పింది నీరజ.

 

‘ఇష్టం’ సినిమాతో టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చి, అతి తక్కువ కాలంలోనే స్టార్ హీరోయిన్ గా ట్రాన్స్ ఫామ్ అయిన శ్రియ, ఇప్పటికే యూత్ ఫేవరేట్ హీరోయిన్ గా మెస్మరైజ్ చేస్తుంది. ప్రస్తుతం సెట్స్ పై ఉన్న వీర భోగ వసంత రాయలు సినిమాలో కీ రోల్ ప్లే చేస్తుంది శ్రియ.