పని పూర్తిచేసిన శైలజారెడ్డి అల్లుడు

Saturday,July 21,2018 - 04:01 by Z_CLU

మోస్ట్ ఎవెయిటింగ్ మూవీ శైలజారెడ్డి అల్లుడు షూటింగ్ పూర్తిచేసుకుంది. నాగచైతన్య, మారుతి ఫ్రెష్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమా, ఒక పాట మినహా షూటింగ్ పూర్తిచేసుకున్నట్టు దర్శకుడు మారుతి ప్రకటించాడు.

మిగిలిన ఆ ఒక్క పాటను కూడా త్వరలోనే పూర్తిచేసి, మూవీని ఆగస్ట్ 31న థియేటర్లలోకి తీసుకురాబోతున్నారు. ఈ సినిమాకు కీరవాణి సంగీతం అందిస్తున్నాడు.

నాగచైతన్య, అను ఎమ్మాన్యుయేల్ హీరోహీరోయిన్లుగా నటించిన ఈ సినిమాలో రమ్యకృష్ణ కీలక పాత్ర పోషిస్తోంది. నిజానికి టైటిల్ రోల్ ఈమెదే. ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై తెరకెక్కుతోంది శైలజారెడ్డి అల్లుడు. గోపీసుందర్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు.