జీ సినిమాలు ( 22nd జూలై )

Saturday,July 21,2018 - 11:24 by Z_CLU

పోలీస్ స్టోరీ-2

హీరోసాయికుమార్

ఇతర నటీనటులురాక్ లైన్ వెంకటేశ్, పీజే శర్మ, సన, శోభరాజ్, పొన్నాంబలం

సంగీతంఆర్పీ పట్నాయక్

స్క్రీన్ ప్లే, దర్శకత్వంథ్రిల్లర్ ముంజు

విడుదల తేదీ – 1996

అప్పటికే సౌత్ లో పెద్ద హిట్ అయిన పోలీస్ స్టోరీకి సీక్వెల్ గా పోలీస్ స్టోరీ-2ను తెరకెక్కించారు. పోలీస్ స్టోరీ సినిమాకు పనిచేసిన టీం అంతా దాదాపుగా సీక్వెల్ కు కూడా పనిచేశారు. ఇప్పటికీ సాయికుమార్ కెరీర్ లో చిరస్థాయిగా నిలిచిపోయే అగ్ని పాత్ర సినిమాలోనిదే. యాక్షన్ సినిమాలు, అదిరిపోయే మాస్ డైలాగులు కోరుకునే ప్రేక్షకులకు సినిమా ఫుల్ మీల్స్ లాంటిది.

============================================================================

సీతారాముల కళ్యాణం లంకలో

నటీనటులు : నితిన్, హన్సిక

ఇతర నటీనటులు : సుమన్, సలీమ్, చంద్ర మోహన్, ప్రగతి, బ్రహ్మానందం, వేణు మాధవ్, ఆలీ, M.S.నారాయణ, సుబ్బరాజు, దువ్వాసి మోహన్, జయ ప్రకాష్ రెడ్డి

మ్యూజిక్ డైరెక్టర్ : అనూప్ రూబెన్స్

డైరెక్టర్ : ఈశ్వర్

ప్రొడ్యూసర్ : మల్ల విజయ్ ప్రసాద్

రిలీజ్ డేట్ : జనవరి 22, 2010

భయమంటే ఏమిటో తెలియని ఒక యంగ్ స్టర్ ఫ్యాక్షనిస్ట్ కూతురితో ప్రేమలో పడతాడు. ప్రేమను దక్కించుకోవడానికి, తను ప్రేమించిన అమ్మాయిని ప్రమాదం నుండి కాపాడటానికి ఏం చేశాడు అనే కథాంశంతో తెర కెక్కింది సీతారాముల కళ్యాణం లంకలో. సినిమాలో యాక్షన్ సీన్స్ హైలెట్ గా నిలుస్తాయి.

============================================================================

మడత కాజ

నటీనటులు : అల్లరి నరేష్, స్నేహ ఉల్లాల్

ఇతర నటీనటులు : మర్యమ్ మజారియా, ఆశిష్ విద్యార్థి, ఆలీ, సుబ్బరాజు, ధర్మవరపు సుబ్రహ్మణ్యం, M.S. నారాయణ తదితరులు

మ్యూజిక్ డైరెక్టర్ : శ్రీ వసంత్

డైరెక్టర్ : సీతారామరాజు దంతులూరి

ప్రొడ్యూసర్ : వేదరాజు టింబర్

రిలీజ్ డేట్ : 29 సెప్టెంబర్ 2011

అల్లరి నరేష్ నటించిన హిల్లేరియస్ ఎంటర్ టైనర్ మడత కాజా. పోలీస్ ఇన్ఫార్మర్ గా పని చేసే ఒక యువకుడు, మాఫియా డాన్ చేస్తున్న ఆకృత్యాలను ఎలా బయటికి లాగాడనే అనే అంశంతో తెరకెక్కిన చిత్రం. సినిమాలో కామెడీ హైలెట్ గా నిలిచింది.

=============================================================================

అదిరిందయ్యా చంద్రం

నటీనటులు శివాజీ, లయ

ఇతర నటీనటులుసంగీత, మధుశర్మ, బ్రహ్మానందం, అలీ, వేణుమాధవ్, ఏవీఎస్

మ్యూజిక్ డైరెక్టర్ఎం.ఎం.శ్రీలేఖ

డైరెక్టర్  – శ్రీనివాసరెడ్డి

రిలీజ్ డేట్  – 2005, ఆగస్ట్ 20

శివాజీ, లయ కలిసి నటించిన కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ అదిరిందయ్యా చంద్రంశివాజీ కెరీర్ లో సూపర్ హిట్ సినిమాల్లో ఒకటిగా ఇది నిలిచిపోతుంది. శివాజీలో అదిరిపోయే కామెడీ టైమింగ్ ఉందని మరోసారి నిరూపించింది సినిమా.

============================================================================

ఆట

నటీనటులు : సిద్ధార్థ్ నారాయణ్, ఇలియానా డిక్రూజ్

ఇతర నటీనటులు : మున్నా, శరత్ బాబు, సునీల్, బ్రహ్మానందం, జయ ప్రకాష్ రెడ్డి, సాయాజీ షిండే, ధర్మవరపు సుబ్రహ్మణ్యం, అనురాధా తదితరులు

మ్యూజిక్ డైరెక్టర్ : దేవి శ్రీ ప్రసాద్

డైరెక్టర్ : V.N.ఆదిత్య

ప్రొడ్యూసర్ : M.S. రాజు

రిలీజ్ డేట్ : 9 మే 2007

చిన్నప్పటి నుండి సినిమాలు చూస్తూ పెరిగిన శ్రీకృష్ణ, తన లైఫ్ ని కూడా హీరోలా లీడ్ చేయాలనుకుంటాడు. అంతలో సత్యతో ప్రేమలో పడిన శ్రీకృష్ణ ఆ తరవాత తన లైఫ్ లో వచ్చిన సమస్యల్ని ఎలా ఎదుర్కున్నాడు…? అనేదే ఈ సినిమా ప్రధానాంశం. ఈ సినిమాకి DSP మ్యూజిక్ హైలెట్ గా నిలిచింది.

=============================================================================

 

సికందర్

నటీనటులు : సూర్య, సమంతా రుత్ ప్రభు

ఇతర నటీనటులు : విద్యుత్ జమ్వాల్, సూరి, బ్రహ్మానందం, మనోజ్ బాజ్ పాయ్, దళిప్ తాహిల్, మురళి శర్మ, ఆసిఫ్ బస్రా మరియు తదితరులు

మ్యూజిక్ డైరెక్టర్ : యువన్ శంకర్ రాజా

డైరెక్టర్ : N. లింగుస్వామి

ప్రొడ్యూసర్ : సిద్ధార్థ్ రాయ్ కపూర్, N. సుభాష్ చంద్రబోస్

రిలీజ్ డేట్ : 14 ఆగష్టు 2014

సూర్య హీరోగా నటించిన సికందర్ పక్కా యాక్షన్ ఎంటర్ టైనర్. డ్యూయల్ రోల్ లో నటించిన సూర్య నటన సినిమాకే హైలెట్ గా నిలుస్తుంది. చిన్నప్పుడే తప్పిపోయిన తన అన్నను వెదుక్కుంటూ వచ్చిన తమ్ముడు అప్పటికే తన అన్న సిటీలో పెద్ద డాన్ అని తెలుసుకుని షాక్ కి గురి అవుతాడు. ఆ తర్వాత ఏం జరుగుతుంది అనేది ప్రధాన కథాంశం. ఈ సినిమాలో సూర్య సరసన సమంతా హీరోయిన్ గా నటించింది.