ఆ రెండు క్లాసిక్స్ కు సీక్వెల్స్?

Monday,May 11,2020 - 02:32 by Z_CLU

కొన్ని క్లాసిక్ సినిమాల గురించి తలుచుకుంటే చాలు సినిమా ప్రేమికులకు అప్పటి రోజులన్నీ కళ్ళ ముందు కనబడతాయి. అలాంటి క్లాసిక్ సినిమాల్లో ‘జగదేక వీరుడు అతిలోకసుందరి’ ఒకటి కాగా మరొకటి ‘పెళ్లి సందడి’. ఇప్పుడీ క్లాసిక్ సినిమాలకు సీక్వెల్స్ రెడీ చేసే పనిలో ఉన్నారు దర్శక-నిర్మాత. ఈ రెండు సినిమాలకు దర్శకత్వం వహించిన దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు ఇప్పటికే ఆ వర్క్ స్టార్ట్ చేశారట.

‘జగదేక వీరుడు అతిలోకసుందరి’ విడుదలై 30 ఏళ్ళయిన సందర్భంగా మీడియాకి ఇంటర్వ్యూ లు ఇచ్చిన నిర్మాత అశ్వనీదత్ ఈ సీక్వెల్ పై తన మనసులో మాటను బయటపెట్టారు. ఎప్పటికైనా జగదేకవీరుడు అతిలోకసుందరి కి సీక్వెల్ చేస్తానని తెలిపారు. ఆ సీక్వెల్ చేసిన తర్వాతే నిర్మాతగా రిటైర్ అవుతానని కూడా ఆయన క్లారిటీ ఇచ్చారు.

ఇక పనిలో పనిగా ‘పెళ్లి సందడి’ కి కూడా సీక్వెల్ ప్లాన్ చేస్తున్నారని టాక్. మరి ఈ రెండు క్లాసిక్ సినిమాలకు సీక్వెల్స్ ఎప్పుడొస్తాయ్..? ఒకవేళ వస్తే ఆ క్లాసిక్ సినిమాలకు తీసిపోని విధంగా ఉంటాయా అనేది ఆసక్తికంరగా మారింది. ఇన్ సైడ్ సోర్స్ ప్రకారం.. ఈ ఏడాదిలోనే ఈ రెండు సీక్వెల్స్ పై ఓ క్లారిటీ రాబోతోంది.