'ఉప్పెన' సాంగ్ కి 50 మిలియన్ వ్యూస్

Monday,May 11,2020 - 02:14 by Z_CLU

‘ఉప్పెన’ సినిమా నుండి వచ్చిన ఫస్ట్ సింగిల్… రిలీజైన రోజు నుంచే జోరుగా దూసుకెళ్తూ శ్రోతలను ఆకట్టుకుంది. తాజాగా ఈ పాట రికార్డు వ్యూస్ అందుకుంది. యూట్యూబ్ లో ‘నీ కన్ను నీలి సముద్రం’ సాంగ్ 50 మిలియన్ వ్యూస్ మార్క్ కి చేరుకుంది. దేవిశ్రీ ప్రసాద్ కంపోజ్ చేసిన ట్యూన్ కి శ్రీమణి అందించిన సాహిత్యం చక్కగా కుదిరడంతో పెద్ద హిట్టయింది. ముఖ్యంగా జావేద్ అలీ సింగింగ్ కూడా పాటకు మరింత అందం తీసుకొచ్చింది.

ప్రస్తుతం ఎక్కడ విన్నా ఎక్కువగా ఈ పాటే వినిపిస్తుంది. చాలా రోజులకి ఓ లవ్ ఫీలింగ్ తో సాంగ్ కంపోజ్ చేసే అవకాశం దొరకడంతో మళ్ళీ తన మేజిక్ క్రియేట్ చేసి మ్యూజిక్ లవర్స్ కి బెస్ట్ సాంగ్ అందించాడు దేవి.

మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ బ్యానర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ స్టేజిలో ఉంది. త్వరలోనే థియేటర్స్ లోకి రానుంది.