Seetimaar Teaser - కబడ్డీ వేట

Monday,February 22,2021 - 01:10 by Z_CLU

ఎగ్రెసివ్ స్టార్ గోపీచంద్, మాస్ డైరెక్టర్ సంప‌త్ నంది కాంబినేష‌న్‌లో మాస్ గేమ్ అయిన క‌బ‌డ్డీ నేప‌థ్యంలో తెర‌కెక్కుతోన్న స్పోర్ట్స్ యాక్షన్ మూవీ ‘సీటీమార్‌’. గోపిచంద్ కెరీర్‌లోనే భారీ బ‌డ్జెట్‌, హై టెక్నిక‌ల్ వాల్యూస్‌తో శ్రీనివాసా సిల్వర్‌ స్క్రీన్‌ బ్యానర్ పై శ్రీనివాసా చిట్టూరి ఈ చిత్రాన్నినిర్మిస్తున్నారు.

గోపిచంద్ అభిమానులు ఎంత‌గానో ఎదురుచూస్తున్న ఈ మూవీ టీజ‌ర్‌ను ఈ రోజు రిలీజ్ చేశారు. యాక్ష‌న్ చెప్ప‌గానే క‌బ‌డ్డీ, క‌బ‌డ్డీ,క‌బ‌డ్డీ అంటూ మొద‌లైన 70 సెకెన్ల నిడివిగ‌ల ఈ టీజ‌ర్ ఆధ్యంతం ఉత్కంఠభరితంగా సాగింది. రేయ్ కార్తి‌..అంటూ రావు ర‌మేష్ పిల‌వ‌గానే `న‌న్నెవ‌డైనా అలా పిల‌వాలంటే ఒక‌టి మా ఇంట్లో వాళ్లు పిల‌వాలి లేదా నా ప‌క్క‌నున్న ఫ్రెండ్స్ పిల‌వాలి..ఎవ‌డు ప‌డితే వాడు పిలిస్తే వాడి కూత ఆగిపోద్ది` అంటూ గోపిచంద్ చెప్పే డైలాగ్ టీజర్ కే హైలెట్ గా నిలిచింది.

అలాగే `క‌బ‌డ్డీ మైదానంలో ఆడితే ఆట..బ‌య‌ట ఆడితే వేట` అనే డైలాగ్‌కి మంచి రెస్పాన్స్ వ‌స్తోంది. గోపీచంద్ సీటీ వేయ‌డంతో ఈ టీజ‌ర్ ముగుస్తుంది.

మెలొడిబ్ర‌హ్మ మ‌ణిశ‌ర్మ సంగీతం అందిస్తున్న ఈ చిత్రంలో భూమిక కీల‌క పాత్ర‌లో న‌టిస్తోంది. ఇప్ప‌టికే రిలీజైన గోపిచంద్‌, త‌మ‌న్నా లుక్స్‌కి మంచి రెస్పాన్స్ వ‌చ్చింది. ఈ చిత్రం స‌మ్మ‌ర్ స్పెష‌ల్‌గా ఏప్రిల్‌2న ప్ర‌పంచ‌వ్యాప్తంగా విడుద‌ల‌వుతుంది.

గోపిచంద్‌, త‌మ‌న్నా, భూమిక‌, దిగంగ‌న సూర్య‌వంశి, పోసాని కృష్ణముర‌ళి, రావు ర‌మేష్‌‌, రెహ‌మాన్, బాలీవుడ్ యాక్టర్ త‌రుణ్ అరోరా త‌దిత‌రులు ముఖ్య పాత్ర‌లు పోషిస్తున్న ఈ చిత్రంలో అప్స‌ర రాణి స్పెష‌ల్ సాంగ్‌ చేసింది.