Satya Dev 'గుర్తుందా శీతాకాలం' ట్రైలర్ రివ్యూ

Saturday,December 03,2022 - 06:27 by Z_CLU

యంగ్ & టాలెంటెడ్  యాక్టర్ సత్యదేవ్ (Satya Dev), తమన్న జంటగా నటించిన రొమాంటిక్ ఎంటర్‌టైనర్ తెరకెక్కిన ఫీల్ గుడ్ రొమాంటిక్ ఎంటర్టైనర్ ‘గుర్తుందా శీతాకాలం’ (Gurtunda Seethakalam).  ఎట్టకేలకు ఈ సినిమా డిసెంబర్ 9న ప్రేక్షకులు ముందుకు రానుంది. తాజాగా మేకర్స్ థియేట్రికల్ ట్రైలర్‌ రిలీజ్ చేశారు.

మన జీవితంలోని మొదటి ప్రేమ మ్యాజిక్, అందమైన రొమాంటిక్ క్షణాలను ఎప్పటికి మరచిపోలేము అటువంటి జ్ఞాపకాలను ఈ చిత్రం మరోసారి గుర్తుచేస్తుంది.

Once upon a time they was boy called.. అంటూ సత్య దేవ్ వాయిస్ తో చెప్తూ మొదలైన ట్రైలర్ ఆకట్టుకుంది.  శీతాకాలంలో ఓ కుర్రాడి జీవితంలో తెచ్చిన సంతోషాలు గుర్తుచేస్తూ సినిమాపై అంచనాలు పెంచేసింది ట్రైలర్. ఓ అబ్బాయి జీవితంలో కొచ్చిన కోమలి , అమ్ము , దివ్య, నిధి ఇలా నాలుగు ప్రేమకథల్ని ఈ సినిమాలో చూపించబోతున్నారు.  స్కూల్ . కాలేజీ , జర్నీ లవ్ స్టోరీస్ తో వివిధ దశల ప్రేమకథలతో ఫీల్ గుడ్ లవ్ స్టోరీగా ఈ సినిమా తెరకెక్కింది. ట్రైలర్ లో విజువల్స్ , మ్యూజిక్ , డైలాగ్స్ హైలైట్ గా నిలిచాయి. ఈ రొమాంటిక్ ఎంటర్టైనర్ యూత్ కి బాగా కనెక్ట్ అవుతుందని ట్రైలర్ చూస్తే అర్థమవుతుంది.

తమన్నా భాటియా (Tamannaah) మేఘా ఆకాష్, కావ్య శెట్టి ఈ చిత్రంలో కథానాయికలుగా నటిస్తున్నారు. కన్నడలో సక్సెస్ ఫుల్ డైరెక్టర్ నాగశేఖర్ ఈ సినిమాతో టాలీవుడ్ కి పరిచయం అవుతున్నాడు. శ్రీ వేదాక్షర ఫిలింస్, నాగశేఖర్ మూవీస్, మణికంఠ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్లపై నిర్మాతలు చింతపల్లి రామారావు, భావన రవి, నాగశేఖర్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. చినబాబు, ఎంఎస్ రెడ్డి సమర్పిస్తున్న ఈ చిత్రానికి కాలభైరవ సంగీతం అందించారు.

శీతాకాలం సీజన్ లో “గుర్తుందా శీతాకాలం” డిసెంబర్ 9న విడుదలవుతోంది