'శతమానం భవతి' మోషన్ పోస్టర్ విడుదల

Tuesday,August 09,2016 - 12:49 by Z_CLU

శ్రీ వెంకటేశ్వర ఆర్ట్ క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు నిర్మిస్తున్న చిత్రం శతమానంభవతి. యూత్ ఫుల్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమా మోషన్ పోస్టర్ ను ఈరోజు విడుదల చేశారు. సినిమాను సంక్రాంతికి విడుదల చేయబోతున్నట్టు ప్రకటించారు.

    శర్వానంద్ హీరోగా నటిస్తున్న ఈ సినిమాలో అ..ఆ సినిమాతో గుర్తింపు తెచ్చుకున్న అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటిస్తోంది. సతీష్ వేగేశ్న దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ ఏడాది సంక్రాంతికి ఎక్స్ ప్రెస్ రాజాతో సందడి చేశాడు శర్వానంద్. ఆ సినిమా మంచి విజయాన్నందుకుంది. దీంతో వచ్చే సంక్రాంతి కోసం శతమానం భవతిని సిద్ధం చేస్తున్నారు. ఈ సినిమాతో మరోసారి హిట్ కొట్టాలనుకుంటున్నాడు శర్వ.