శాతకర్ణి దండయాత్రకు డేట్ ఫిక్స్

Monday,January 02,2017 - 09:15 by Z_CLU

బాలయ్య ప్రతిష్టాత్మకంగా నటిస్తున్న గౌతమీపుత్ర శాతకర్ణి విడుదల తేదీ ఫిక్స్ అయింది. సంక్రాంతి బరిలో నిలిచిన ఈ సినిమాను జనవరి 12న థియేటర్లలోకి తీసుకురావాలని నిర్ణయించారు. అంతకంటే ముందు, జనవరి 11న ఓవర్సీస్ లో ఈ సినిమా ప్రీమియర్స్ ను భారీ ఎత్తున ప్లాన్ చేశారు. తెలుగు రాష్ట్రాల్లో గౌతమీపుత్ర శాతకర్ణి విడుదలయ్యే సమయానికే సినిమా టాక్ తెలిసే ఛాన్స్ ఉంది.

మరోవైపు ఈ సినిమా ఫస్ట్ కాపీ శరవేగంగా సిద్ధమౌతోంది. ఈనెల 5న సినిమాకు సెన్సార్ పూర్తిచేయాలని భావిస్తున్నారు. రిలీజ్ డేట్ ప్రకటించిన సందర్భంగా క్రిష్ మాట్లాడుతూ.. “మోరోకో, మధ్యప్రదేశ్ ప్రదేశాల్లో చిత్రీకరించిన కీలక సన్నివేశాల చిత్రీకరణ సమయంలో బాలకృష్ణగారు చూపిన తెగువ, ఆయన అందించిన సహకారం ఎప్పటికీ మరువలేనిది. కన్నడ స్టార్ హీరో శివరాజ్ కుమార్, బాలీవుడ్ డ్రీమ్ గర్ల్ హేమమాలినీలు పోషించిన ప్రత్యేక పాత్రలు సినిమాకి ఆయువుపట్టుగా నిలుస్తాయి” అని అన్నారు.