జీ సినిమాలు (జనవరి 2nd)

Sunday,January 01,2017 - 10:00 by Z_CLU

chilipi-krishnudu-zee-cinemalu

నటీనటులు – అక్కినేని, వాణిశ్రీ

ఇతర నటీనటులు – సత్యనారాయణ, గుమ్మడి, రావుగోపాల్రావు, ప్రభాకరరెడ్డి

మ్యూజిక్ డైరెక్టర్ – కె. వి. మహదేవన్

నిర్మాత – డి.రామానాయుడు

దర్శకత్వం – బోయిన సుబ్బారావు

విడుదల తేదీ – 1978, జనవరి 11

లెజెండ్ అక్కినేని, మూవీ మొఘల్ రామానాయుడు కాంబినేషన్ లో వచ్చిన మరో హిట్ చిత్రం చిలిపి కృష్ణుడు. అప్పటికే పలు సీరియస్ సినిమాలు చేసిన ఈ సూపర్ హిట్ ద్వయం… ఈసారి కాస్త ఫన్నీగా ఉండే కుటుంబకథను ఎంచుకోవాలని ఫిక్స్ అయింది. అలా బోయిన సుబ్బారావు దర్శకత్వంలో పుట్టుకొచ్చిన సినిమానే చిలిపి కృష్ణుడు. ఆచార్య ఆత్రేయ డైలాగులు, కేవీ మహదేవన్ సంగీతం ఈ సినిమాకు స్పెషల్ ఎట్రాక్షన్స్. అప్పటికే సూపర్ హిట్ జోడీగా పేరుతెచ్చుకున్న అక్కినేని,వాణిశ్రీ ఈ సినిమాతో రికార్డు వసూళ్లు సాధించారు.

===============================================

pavitra-hridayalu-zee-cinemalu

నటీనటులు : నందమూరి తారక రామారావు, జమున, చంద్రకళ

ఇతర నటీనటులు : శాంత కుమారి, సంధ్యా రాణి, గుమ్మడి, నాగయ్య, రాజబాబు, సత్య నారాయణ, అల్లు రామ లింగయ్య తదితరులు

మ్యూజిక్ డైరెక్టర్ : చలపతి రావు

డైరెక్టర్ : A.C. త్రిలోక్ చందర్

ప్రొడ్యూసర్ : C.S.రాజు

రిలీజ్ డేట్ : 1971

నందమూరి తారక రామారావు, జమున నటించిన అద్భుత ప్రేమకథా చిత్రం పవిత్ర హృదయాలు. ఈ సినిమాకి చలపతి రావు అందించిన సంగీతం ప్రాణం.

===============================================

pandurangadu-zee-cinemalu

నటీ నటులు : నందమూరి బాలకృష్ణ, స్నేహ, టాబూ

ఇతర నటీనటులు : అర్చన, మేఘనా నాయుడు, సుహాసిని, మోహన్ బాబు, K.విశ్వనాథ్, బ్రహ్మానందం, సునీల్, ధర్మవరపు సుబ్రహ్మణ్యం

మ్యూజిక్ డైరెక్టర్ : కీరవాణి

డైరెక్టర్ : రాఘవేంద్ర రావు

నిర్మాత : కృష్ణమోహన రావు

రిలీజ్ డేట్ : 30 మే 2008

1957 లో NTR నటించిన పాండురంగ మహాత్యం సినిమాకి రీమేక్ ఈ “పాండు రంగడు” సినిమా. అన్నమయ్య, శ్రీరామ దాసు లాంటి సినిమాల తర్వాత బాలకృష్ణ తో కూడా ఒక భక్తిరస చిత్రం చేయాలనుకున్న రాఘవేంద్ర రావు ఈ సినిమాని తెరకెక్కించారు. పాండురంగనిగా బాలకృష్ణ నటన, దానికి తోడు కీరవాణి సంగీతం ప్రతీది సినిమాకు ప్రత్యేక ఆకర్షణే. బాలయ్య సరసన స్నేహ, టాబూ హీరోయిన్ లుగా నటించారు.

===============================================

raraju-zee-cinemalu

నటీనటులు : గోపీచంద్, మీరా జాస్మిన్

ఇతర నటీనటులు : అంకిత, శివాజీ, ఆశిష్ విద్యార్థి, జయ ప్రకాష్ రెడ్డి, చంద్ర మోహన్

మ్యూజిక్ డైరెక్టర్ : మణిశర్మ

డైరెక్టర్ : ఉదయ శంకర్

ప్రొడ్యూసర్ : GVG రాజు

రిలీజ్ డేట్ : 20 అక్టోబర్ 2006

గోపీచంద్ హీరోగా ఉదయ్ శంకర్ డైరెక్షన్ లో తెరకెక్కింది రారాజు. అతి సున్నితమైన లవ్ స్టోరి కి  మాస్ ఎలిమెంట్స్ జోడించి ఇంటరెస్టింగ్ గా తెరకెక్కించాడు. ఈ సినిమాలో కలెక్టర్ కావాలని కలలు కనే ఆంబీషియస్ అమ్మాయిగా మీరా జాస్మిన్ సరికొత్తగా కనిపిస్తుంది.  మణిశర్మ మ్యూజికే సినిమాకి హైలెట్.

===============================================

siddhu-from-srikakulam-zee-cinemalu

నటీనటులు : అల్లరి నరేష్, మంజరి

ఇతర నటీనటులు : శ్రద్ధా దాస్, జయ ప్రకాష్ రెడ్డి, ధర్మవరపు సుబ్రహ్మణ్యం, కొండవలస లక్ష్మణ రావు, M.S. నారాయణ తదితరులు

మ్యూజిక్ డైరెక్టర్ : K.M. రాధా కృష్ణన్

డైరెక్టర్ : ఈశ్వర్

ప్రొడ్యూసర్ : మల్లా విజయ ప్రసాద్

రిలీజ్ డేట్ : 14 ఆగష్టు 2008

 అల్లరి నరేష్, మంజరి హీరో హీరోయిన్లుగా నటించిన సిద్ధూ ఫ్రం శ్రీకాకుళం సినిమా పర్ ఫెక్ట్ ఫ్యామిలీ కామెడీ ఎంటర్ టైనర్. ప్రాణం కన్నా ప్రేమే గొప్పది అన్నదే ఈ సినిమా ప్రధాన కథాంశం. కామెడీ ఈ సినిమాలో హైలెట్ గా నిలిచింది.

===============================================

vishal-jayasurya-zee-cinemalu

నటీనటులు : విశాల్, కాజల్ అగర్వాల్

ఇతర నటీనటులు : సముథిరఖని, సూరి, DMJ రాజసింహన్, ఐశ్వర్య దత్త తదితరులు

మ్యూజిక్ డైరెక్టర్ : D. ఇమ్మన్

డైరెక్టర్ : సుసీంథిరణ్

ప్రొడ్యూసర్ : S. మదన్

రిలీజ్ డేట్ : 4 సెప్టెంబర్ 2015

విశాల్, కాజల్ జంటగా నటించిన రొమాంటిక్ యాక్షన్ ఎంటర్ టైనర్ జయసూర్య. సిటీలో కిడ్నాప్ లు చేసి భయ భ్రాంతులకు గురి చేసే క్రిమినల్స్ కి మధ్య జరిగే క్రైం థ్రిల్లర్ ఈ సినిమా. ACP  జయసూర్యగా విశాల్ నటన సినిమాకే హైలెట్.

===============================================

allulla-majaka-zee-cinemalu

నటీనటులు : అజీజ్ నాజర్, స్తుతి, మస్త్ ఆలీ, వందన

మ్యూజిక్ డైరెక్టర్ : విశ్వ

డైరెక్టర్ : RK

ప్రొడ్యూసర్ : RK

హైదరాబాద్ బ్యాక్ డ్రాప్ లో ఫన్ లోడెడ్ ఎలిమెంట్స్ తో తెరకెక్కిందే అల్లుళ్ళా మజాకా. హిందీలో బ్లాక్ బస్టర్ అయిన హైదరాబాదీ నవాబ్స్ కి డబ్బింగ్ వర్షన్ ఈ సినిమా. RK నిర్మించిన ఈ సినిమాలో కామెడీ హైలెట్ గా నిలిచింది.