సరిలేరు నీకెవ్వరు ట్రయిలర్ రివ్యూ

Monday,January 06,2020 - 11:43 by Z_CLU

మహేష్ కు ఓ సెపరేట్ స్టయిల్ మేనరిజమ్స్ ఉంది. అలాగే దర్శకుడు అనీల్ రావిపూడికి కూడా కామెడీలో ఓ ఇమేజ్ ఉంది. ఇద్దరూ కలిసి సినిమా చేస్తున్నారు. మరి మహేష్ స్టయిల్ లోకి అనీల్ రావిపూడి వచ్చాడా? లేక అనీల్ రావిపూడి కామెడీ టైమింగ్ లోకి మహేష్ వచ్చాడా? ఈ డౌట్ సినిమా స్టార్ట్ అయినప్పట్నుంచి ఉంది. దానికి సమాధానంగా వచ్చింది సరిలేరు నీకెవ్వరు ట్రయిలర్.

చాన్నాళ్ల తర్వాత మహేష్ కామెడీ చేశాడు. అది కూడా అనీల్ రావిపూడి మార్క్ కామెడీ. అటు అనీల్ రావిపూడి కూడా చాన్నాళ్ల తర్వాత భారీ యాక్షన్ సీక్వెన్సెస్ చేశాడు. అది కూడా మహేష్ బాబు ఇమేజ్ కు తగ్గట్టు. ఇలా రెండూ బ్యాలెన్స్ చేస్తూ సరిలేరు నీకెవ్వరు సినిమా తెరకెక్కిందనే విషయం ట్రయిలర్ చూస్తే అర్థమౌతోంది.

దాదాపు అర్థగంట పాటు ఉన్న ట్రయిన్ ఎపిసోడ్ టోటల్ సినిమాకే హైలెట్ అని చెబుతోంది యూనిట్. అందుకే ట్రయిలర్ లో కూడా ఎక్కువ భాగం ఆ ట్రయిన్ ఎపిసోడ్ కే కేటాయించారు. మేజర్ కామెడీ అంతా ట్రైన్ సీక్వెన్స్ లోనే వచ్చేలా ఉంది. దీనికి తోడు మహేష్ మేనరిజమ్స్, డైలాగ్స డెలివరీ, స్టయిల్.. ట్రయిలర్ లో పీక్స్

ఇక ట్రయిలర్ లో సినిమాటోగ్రాఫీ, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ చాలా బాగున్నాయి. దేవిశ్రీప్రసాద్ తన బీజీఎంతో ట్రయిలర్ ను నెక్ట్స్ లెవెల్లో నిలబెట్టాడు. కానీ అతడు కంపోజ్ చేసిన పాటలకు మాత్రం ట్రయిలర్ లో చోటు దక్కలేదు. సంక్రాంతి కానుకగా 11న థియేటర్లలోకి రాబోతోంది సరిలేకు నీకెవ్వరు.