ఓ బేబీ టీజర్.. స్వాతిగా మారిన సమంత

Saturday,May 25,2019 - 04:36 by Z_CLU

తనకంటూ ఓ సెపరేట్ రూట్ క్రియేట్ చేసుకున్న సమంత ఈసారి మరో విలక్షణ పాత్ర పోషించింది. ఆమె నటించిన ఓ బేబీ సినిమా టీజర్ లాంఛ్ అయింది. చాలా కలర్ ఫుల్ గా, ఇంకెంతో ఇంట్రెస్టింగ్ గా ఉంది ఆ టీజర్.

కొరియన్ సినిమాకు రీమేక్ గా వస్తున్న ఓ బేబీ సినిమా స్టోరీలైన్ చాలామందికి తెలిసిందే. సడెన్ గా ఓ పెద్దావిడ పాతికేళ్ల పడుచుపిల్లగా మారిపోతే ఎలా ఉంటుందనేదే ఈ స్టోరీ. మంచి ఫన్ తో పాటు బోలెడంత ఎమోషన్ కూడా ఉంది ఈ సినిమాలో. టీజర్ లో మాత్రం ఫన్ యాంగిల్ నే రివీల్ చేశారు.

నందినీరెడ్డి డైరక్ట్ చేసిన ఈ సినిమాకు మిక్కీ జే మేయర్ మంచి బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందించాడు. సురేష్ బాబు, టీజీ విశ్వప్రసాద్ సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమాకు ఇంకా రిలీజ్ డేట్ ఎనౌన్స్ చేయలేదు.