శర్వా కొత్త సినిమా టైటిల్ ఇదే

Saturday,May 25,2019 - 04:34 by Z_CLU

సుధీర్ వర్మ దర్శకత్వంలో చాన్నాళ్లుగా ఓ సినిమా చేస్తున్నాడు శర్వానంద్. ఈ సినిమాకు సరైన టైటిల్ దొరక్క చాలా ఇబ్బంది పడ్డారు. అన్నీ వెదికి దళపతి అనే టైటిల్ పెడితే, అది వేరే సంస్థపైన రిజిస్టర్ అయింది. దీంతో రెండో ఆప్షన్ గా పెట్టుకున్న రణరంగం అనే టైటిల్ ను ఫిక్స్ చేశారు. ఇదే టైటిల్ తో ఫస్ట్ లుక్ వీడియోను కూడా విడుదల చేశారు.

సినిమాలో రెండు డిఫరెంట్ షేడ్స్ లో కనిపించబోతున్నాడు శర్వానంద్. ఒక పాత్రలో వయసుమళ్లిన డాన్ పాత్ర పోషిస్తున్నాడు. యంగ్ గెటప్ లో 80ల బ్యాక్ డ్రాప్ తో ఉన్న లుక్ ను ఈరోజు విడుదల చేశారు. పనిలోపనిగా ఫస్ట్ లుక్ తో పాటు రిలీజ్ డేట్ కూడా చెప్పేశారు. ఆగస్ట్ 2న థియేటర్లలోకి రానుంది రణరంగం.

సితార ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై నాగవంశీ నిర్మించిన ఈ సినిమాకు ప్రశాంత్ పిళ్లై సంగీతం అందించాడు. కాజల్, కల్యాణి ప్రియదర్శన్ హీరోయిన్లుగా నటించారు.