సుల్తాన్ కలెక్షన్స్ తో అదరగొడుతున్నాడు

Monday,July 18,2016 - 10:40 by Z_CLU

 

సల్మాన్ ఖాన్ హీరో గా అనుష్క శర్మ కథానాయికగా రూపొందిన చిత్రం ‘సుల్తాన్’. ఆలిస్ అబ్బాస్ జాఫర్ దర్శకత్వం లో తెరకెక్కిన ఈ చిత్రం ఇటీవలే ఈద్ కానుకగా విడుదలై ఘన విజయం అందుకుంది. అయితేఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు రాబడుతూ అందరినీ అవాక్కయ్యేలా చేస్తుంది. ఇక ఈ చిత్రం ఇప్పటికే దాదాపు 250 కోట్ల మార్క్ ను దాటిందని సమాచారం.తొలి రోజే 36 కోట్లు కొల్లగొట్టిన ఈ చిత్రం మంచి ఆదరణ తో అన్ని సెంటర్లలో దిగ్విజయం గా ఆడుతూ కలెక్షన్స్ సునామి సృష్టిస్తుంది. గతేడాది ‘భజ్రంగీ భాయిజాన్’ తో ఈద్ కు ప్రేక్షకుల ముందుకొచ్చిన సల్మాన్ ఈ ఏడాది కూడా అలాంటి విజయం తో పాటు భారీ వసూళ్లు రాబడుతున్నాడు. ఇక ఈ సినిమా దాదాపు 300 పైగా అంతే 340 వరకు రాబట్టే అవకాశం ఉందని అంచనా వేస్తున్నాయి ట్రేడ్ వర్గాలు. మరి సుల్తాన్ ఆ అంచనాలను అందుకొని టాప్ కలెక్షనిస్ట్ గా నిలుస్తాడో? లేదో చూడాలి.