కబాలి గురించే...

Monday,July 18,2016 - 08:32 by Z_CLU

 

సూపర్ స్టార్ రజిని కాంత్ తాజాగా నటించిన చిత్రం ‘కబాలి’ రజిని సరసన రాధికాఆప్టే నటించిన ఈ చిత్రానికి కలై పులి ఎస్.థాను నిర్మాత. ఇక ఈ సినిమాకు సంబంధించిన టీజర్ ఇప్పటికే సోషల్ మీడియా లో సరి కొత్త రికార్డు నెలకొల్పి సినిమా పై భారీ స్థాయిలో అంచనాలను పెంచేసింది. సమ్మర్ లో విడుదల కావాల్సిన ఈ చిత్రం కొన్ని అనివార్య కారణాల వల్ల ఆలస్యం అవుతూ ఎట్టకేలకి ఈ నెల 22 న ప్రేక్షకుల ముందు రానుంది. ప్రపంచ వ్యాప్తంగా రజిని అభిమానులు ఎంతో ఆసక్తి గా ఎదురుచూస్తున్న ఈ సినిమా విడుదలకి ముందే హాట్ టాపిక్ గా మారింది. ప్రస్తుతం ఎక్కడ చూసిన కబాలి పోస్టర్స్ దర్శనమిస్తున్నాయి. మొన్న విమానం పై కూడా కబాలి పోస్టర్ దర్శనమివ్వడం తో ఒక్క సారిగా ఈ ఫొటోస్ చూసి అవాక్కయ్యారు ప్రేక్షకులు . ఇక రెస్టారెంట్లలో, కాఫీ షాప్ లలో కూడా కబాలి పోస్టర్స్ కనిపిస్తున్నాయి. అంతే కాదు ప్రస్తుతం ఎక్కడ విన్నా కబాలి ముచ్చట్లే వినిపిస్తున్నాయి కూడా. మరి రజిని హీరో గా నటిస్తున్న సినిమా అంటే ఈ మాత్రం సహజమే కదా. ఇక మొన్న రెండు సినిమాలతో ప్రేక్షకులను ఆకట్టుకోలేక పోయిన రజిని ఈ సినిమాతో బాక్సాఫీస్ ను శాశించి దాదాపు 300 కోట్లు కొల్లగొట్టడం ఖాయమనే వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఇప్పటికే చెన్నై లో థియేటర్స్ వద్ద కబాలి టికెట్స్ లేవు అంటూ హౌస్ ఫుల్ బోర్డులు పెట్టేసారు కూడా. ఇక ఆంధ్రపరదేశ్, తెలంగాణ తో పాటు విదేశాల్లోనూ కూడా ఇదే పరిస్థితి అని సమాచారం. మరి విడుదలకి ముందే ఇలా హాట్ టాపిక్ గా మారిన కబాలి విడుదల తరువాత ఎలాంటి టాక్ ను సొంతం చేసుకుంటుందో? చూడాలి.