మరో సినిమా ఓకే చేసిన సాయితేజ్

Tuesday,December 24,2019 - 01:11 by Z_CLU

ప్రతిరోజూ పండగే సక్సెస్ తో స్పీడ్ పెంచాడు సాయితేజ్. ఇప్పటికే ఓ సినిమాను సెట్స్ పైకి తీసుకొచ్చిన ఈ మెగా హీరో, తాజాగా మరో మూవీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. దేవ కట్టా దర్శకత్వంలో ఓ డిఫరెంట్ మూవీ చేయబోతున్నాడు సాయితేజ్.

ప్రస్థానం సినిమాతో అందర్నీ ఆకర్షించాడు దేవ్ కట్టా. ఇదే సినిమా రీమేక్ తో బాలీవుడ్ జనాలకు కూడా దగ్గరయ్యాడు. అయితే ఈ రెండు సినిమాల మధ్యలో ఈ డైరక్టర్ చేసిన ఆటోనగర్ సూర్య పెద్దగా ఆడలేదు. మళ్లీ ఇన్నేళ్ల గ్యాప్ తర్వాత మెగా ఫోన్ పట్టుకోబోతున్నాడు దేవకట్టా.

సాయితేజ్ ను డిఫరెంట్ గా, ఇంకా చెప్పాలంటే కాస్త మాస్ లుక్ లో ప్రజెంట్ చేయబోతున్నాడు దేవ కట్టా. స్టోరీలైన్ కూడా చాలా కొత్తగా ఉంటుంది. సరిగ్గా ఇలాంటి ప్రయోగం, మేకోవర్ కోసమే ఎదురుచూస్తున్న సాయితేజ్ వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు.

ప్రస్తుతం ఈ హీరో, సుబ్బు అనే కుర్రాడ్ని దర్శకుడిగా పరిచయం చేస్తూ సోలో బ్రతుకే సో బెటరు అనే సినిమా చేస్తున్నాడు. ఈ మూవీ కంప్లీట్ అయిన వెంటనే దేవకట్టా సినిమా సెట్స్ పైకి వస్తుంది.