రేపే 'కణం' గ్రాండ్ రిలీజ్

Thursday,April 26,2018 - 12:02 by Z_CLU

సాయి పల్లవి, నాగశౌర్య జంటగా నటించిన ‘కణం’ రేపు గ్రాండ్ గా రిలీజవుతుంది. ఇప్పటికే సోషల్ మీడియాలో ఇంట్రెస్టింగ్ బజ్ క్రియేట్ చేసిన ఈ సినిమాపై అటు ఫ్యామిలీ ఆడియెన్స్ తో పాటు యూత్ లోను భారీ క్రేజ్ క్రియేట్ అయి ఉంది.

ఇమోషనల్ హారర్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమా సక్సెస్ గ్యారంటీ అని కాన్ఫిడెంట్ గా ఉన్నారు ఫిల్మ్ మేకర్స్. ‘కణం’ లో  సాయి పల్లవి, బేబీ వెరోనికా మధ్య ఉండబోయే హారర్ ఇమోషనల్ ఎలిమెంట్స్  హైలెట్ కానున్నాయి.

లైకా ప్రొడక్షన్స్ బ్యానర్ పై A.L. విజయ్ డైరెక్షన్ లో తెరకెక్కింది ‘కణం’. రీసెంట్ ‘ఛలో’ సినిమాతో మాస్ హీరోగా ఇమేజ్ క్రియేట్ చేసుకున్న నాగశౌర్య ఈ సినిమాలో కంప్లీట్ గా డిఫెరెంట్ డైమెన్షన్ లో ఎంటర్ టైన్ చేయనున్నాడు.  ఈ సినిమాకి C. శ్యామ్ మ్యూజిక్ కంపోజర్.